Police Stations Name Change in Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని పోలీస్ స్టేషన్లు, డివిజన్ల పేర్లను మార్చుతున్నట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 72వ లా అండ్ ఆర్డర్ పీఎస్‌గా టోలిచౌకి ఏర్పాటు చేసినట్లు, సెక్రటేరియట్ పీఎస్‌ను లేక్ పోలీస్ స్టేషన్‌గా, హుమాయున్ నగర్ పీఎస్‌ను మెహదీపట్నం పీఎస్‌గా, షాహినాయత్‌గంజ్ పీఎస్‌ను గోషామహల్ పీఎస్‌గా మార్చినట్లు ఆయన వివరాలను వెల్లడించారు.
35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్‌లో పోలీస్ స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. నగరంలో 71 లా అండ్ ఆర్డర్, 31 ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు ఉండగా, రెండేళ్లుగా పోలీస్స్టేషన్ల హద్దుల్లో సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌పై గందరగోళం సైతం నెలకొంది. ప్రభుత్వానికి నివేదిక పంపితే మార్పులకు ఆమోదం తెలిపింది. పోలీస్స్టేషన్ల వివరాలను హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్లో పొందుపరుస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
నగరంలో 146 మంది సీఐల బదిలీలు : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ప్రక్షాళన చేపట్టగా పెద్ద ఎత్తున సీఐలను బదిలీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 146 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులను జారీ చేశారు.
పాటలు పాడే లేడీ ట్రాఫిక్ పోలీస్- సిగ్నల్ వద్ద సాంగ్స్ పాడుతూ రూల్స్‌పై అవగాహన
జాతరలో కొన్న హెలికాప్టర్ ఎగరడం లేదు - పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పదేళ్ల బాలుడు!