ETV Bharat / state

శరీర భాగాలను ముక్కలుగా నరికి, మూటకట్టి? - ట్రాన్స్‌జెండర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు - TRANSGENDER MURDER IN ANAKAPLLE

అనకాపల్లి జిల్లాలో సంచలనం రేకెత్తించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు - హత్యకు గురైంది హిజ్రాగా గుర్తింపు - పోలీసులు అదుపులో అనుమానితులు

Police Revealed Transgender Murder Case in Anakapalle District
Police Revealed Transgender Murder Case in Anakapalle District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 20, 2025 at 3:41 PM IST

2 Min Read

Police Revealed Transgender Murder Case in Anakapalle District : అనకాపల్లి జిల్లాలో సంచలనం రేకెత్తించిన సంఘటనలో హత్యకు గురైంది హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మృతదేహం కుడిచేతిపై ఉన్న టాటూ ఆధారంగా నాగులాపల్లిలో ఉంటున్న దిలీప్‌కుమార్‌ (దీపిక అలియాస్‌ దీపు) అనే హిజ్రాగా తోటి హిజ్రాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పోలీసులకు సమాచారం ఇచ్చిన హిజ్రాలు : బెడ్‌షీట్‌లో మూటకట్టిన మహిళ శరీర భాగాలు జాతీయ రహదారిపై కశింకోట మండలం బయ్యవరం వద్ద మంగళవారం కనిపించిన విషయం తెలిసిందే. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చేతికి బంగారు రంగు గాజులు, కుడిచేతిపై టాటూ, కుడికాలుపై పుట్టుమచ్చ ఉన్నట్లు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వివరాలు ఆధారంగా నాగులాపల్లిలో ఉంటున్న దీపుగా అనుమానించిన హిజ్రాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి దర్యాప్తులో విషయం బయటకొచ్చింది.

శస్త్రచికిత్స చేయించుకుని హిజ్రాగా : అనకాపల్లి గవరపాలెంలోని ముత్రాసునాయకుల వీధికి చెందిన దిలీప్‌కుమార్‌ నాలుగేళ్ల కిత్రం శస్త్రచికిత్స చేయించుకుని హిజ్రాగా మారాడు. కాకినాడకు చెందిన బన్నీ అనే డెలివరీ బాయ్‌తో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరూ నాగులాపల్లిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. బన్నీ గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది. ఇతనికి మరో హిజ్రాతో సంబంధం ఉండటంతో దానిపై ప్రశ్నించిన దీపుతో తరచూ గొడవలు జరిగేవని తెలిసింది.

మరో హిజ్రాతో కలిసి హత్య : ఈ నేపథ్యంలో దీపు అడ్డుతొలగించుకోడానికి బన్నీ, మరో హిజ్రాతో కలిసి హత్యచేశారు. శరీర భాగాలను ముక్కలుగా కోసి బయ్యవరం, అనకాపల్లి జాతీయ రహదారిపై తాళ్లపాలెం వంతెన కింద ప్రాంతాల్లో పడేశారని నిందితులు వెల్లడించడంతో మృతదేహం భాగాలను బుధవారం పోలీసులు సేకరించారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ హిజ్రాలు డీఎస్పీ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలంటూ నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు కోరారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్పీ శ్రావణితో మాట్లాడారు.

శరీర భాగాలు వేరు చేసి - ట్రాన్స్​జెండర్​ దారుణ హత్య

"మిస్‌ వరల్డ్" ట్రాన్స్‌ పోటీల్లో ఆనంద్ - అప్పటి వరకు ఆ విషయాన్ని దాచి - హన్నా జీవితంలో మలుపులెన్నో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.