ETV Bharat / state

బెట్టింగ్ కోసం అప్పు- తీర్చమన్నందుకు హత్య! - MURDER CASE IN WEST GODAVARI DIST

మార్చి 26న జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించిన పోలీసులు - కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ అభినందనలు

Police Have Cracked Sensational Murder Case Of Businessman
Police Have Cracked Sensational Murder Case Of Businessman (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 13, 2025 at 5:01 PM IST

2 Min Read

Police Have Cracked Sensational Murder Case Of Businessman : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో మార్చి 26వ తేదీన జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం, పోలవరం మండలం పెద్దవం గ్రామంలో సచివాలయ సర్వేయర్​గా చేస్తున్న శ్రీనివాస్ అదే ప్రాతంలో ఉంటున్న వ్యాపారి పెండ్యాల ప్రభాకర్ వద్ద గత ఏడాది డిసెంబర్​లో రూ. 2 లక్షల 40 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చాలని కొంతకాలంగా వ్యాపారి ప్రభాకర్, శ్రీనివాస్​పై ఒత్తిడి తెచ్చాడు. అయితే బెట్టింగులు, తదితర వ్యసనాలకు అలవాటు పడిన శ్రీనివాస్ అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఎలాగైనా ప్రభాకర్​ను హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అప్పు తీర్చవలసిన అవసరం లేదని భావించాడు.

చేతిని నరికి తన బ్యాగ్​లో : పథకం ప్రకారం వ్యాపారి ప్రభాకర్​కు ఫోన్​చేసి కలిసి మాట్లాడాలని చెప్పడంతో దొమ్మేరులోని నీరుకొండ శేషగిరిరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ తోటలో కలిశారు. ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే శ్రీనివాస్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ప్రభాకర్​పై విచక్షణారహితంగా దాడి చేశాడు. చివరికి ప్రభాకర్ మృతి చెందాడని నిర్ధారించుకున్నాక మృతుడి చేతికి ఉన్న బంగారు కడియం, నాలుగు బంగారు ఉంగరాలు తీసేందుకు శ్రీనివాస్ ప్రయత్నించాడు. అవి ఎంతకీ రాకపోవడంతో చేతిని నరికి తన బ్యాగ్​లో వెసుకోని తీసుకెళ్లాడు. అలాగే మృతుడి మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా శ్రీనివాస్ తన వెంట తీసుకెళ్లాడు.

సంఘటన స్థలానికి మరో ఇద్దరు : అనంతరం శ్రీనివాస్ తన స్నేహితులైన అంకోలు జగదీష్, నోముల ప్రవీణ్ కుమార్​లకు ఫోన్​చేసి సంఘటన స్థలానికి రమ్మని చెప్పడంతో బైక్​పై వచ్చిన ఇరువురితోపాటు, శ్రీనివాస్ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 31.8 గ్రాముల బరువుగల బంగారు గొలుసు, 4.9 గ్రాములు బరువు గల బంగారు ఉంగరం, నేరంకి ఉపయోగించిన బైక్​లు, మూడు సెల్ ఫోన్లు, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆభరణాలను జగదీష్, ప్రవీణ్ కుమార్​లు వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతో వాటిని రికవరీ చేయాల్సి ఉంది. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ దేవకుమార్ అభినందించారు.

భార్యను ముక్కలుగా నరికేసిన భర్త- సూట్‌ కేసులో శరీర భాగాలు కుక్కి పరార్!

ప్రేమ జంటలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు - ఆ నలుగురికి యావజ్జీవ ఖైదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.