PM Modi Visit to Amaravati on May 2: ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలన్న సీఎం వెల్లడించారు.
ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనల్లో 3 పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.
మరో 30 నుంచి 40 వేల ఎకరాలు కావాలి - త్వరలోనే నిర్ణయం: నారాయణ