Phone Tapping Case Accused Shravan Kumar Rao Arrest in Cheating Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ రావును సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ముడి ఇనుము సరఫరా చేస్తానంటూ నగదు తీసుకొని మోసగించినట్టు హైదరాబాద్ నగరానికి చెందిన అఖండ్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఆకర్ష్ క్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు చేశారు. దీనిపై గత నెల 24న శ్రవణ్ రావుపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి విచారించారు. విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి నివాసానికి తరలించారు.
ఎకోర్ నుంచి ముడి ఇనుమును సరఫరా చేస్తానని : బంజారా హిల్స్ మిథిలానగర్ కాలనీలోని అఖండ్ సంస్థ 2008 నుంచి వ్యాపారం నిర్వ హిస్తోంది. 2022 జూన్లో ఆ సంస్థ కార్యాలయానికి శ్రవణ్ కుమార్ రావు వచ్చి ఇన్ రిథమ్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్గా పరిచయం చేసుకున్నాడు. కర్ణాటక సండూర్లోని ఎకోర్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధిగా చెప్పాడు. ఎకోర్ నుంచి ముడి ఇనుమును సరఫరా చేస్తానని ఇందుకు టన్నుకు 300 లాభం వస్తుందని తెలిపాడు. దీంతో ఎకోర్ ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతాకు 2022 నవంబరు నుంచి 2023 డిసెంబరు వరకు విడతల వారీగా రూ.కోట్లలో అఖండ్ సంస్థ నగదును పంపింది.
గాంధీ అస్పత్రిలో వైద్య పరీక్షలు : కంపెనీలకు ముడి ఇనుము సరఫరా చేస్తున్నట్టు వేర్వేరు పేర్లతో రశీదులు సృష్టించాడు. దానిలో టన్నుకు రూ.300 లాభం వచ్చినట్లు ఇన్వాయిస్లను రూపొందించాడు. తమ కంపెనీ పేరుతో ఇన్వాయిస్లు లేకపోవటంతో అనుమానించి అఖండ్ సంస్థ ఆరా తీయగా రూ.6.58 కోట్లు తమకు నష్టం కలిగించినట్టు గుర్తించారు. దీనిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. గాంధీ అస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇంటికి తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు