People Demand Conocarpus Trees Should be Removed Immediately : కోనో కార్పస్ చెట్ల వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆ చెట్లను తొలగించిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
చెట్లను నరికి వేయకుండా వేర్లతో సహా తీసివేయాలి : జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ రహదారికి ఇరువైపులా ఉన్న కోనో కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా రాజీవ్ రహదారి పొడవున వందలాది కొనో కార్పస్ మొక్కలను నాటారు.
కొనో కార్పస్ చెట్ల పుప్పడి రేణువులతో ప్రజల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు వెల్లడించిన ఇక్కడి అధికారులు తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలో కొన్నిచోట్ల సగం వరకు చెట్లను నరికి వదిలారు. వాటికి మళ్లీ కార్పొరేషన్ అధికారులు నీరు అందించడంతో చెట్లను నరికి వేయకుండా వేర్లతో సహా తీసివేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు హాని కలిగించే కొనొ కార్పస్ చెట్లను నియోజకవర్గంలో పూర్తిగా తొలగించాలని అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోనో కార్పస్ చెట్ల పుప్పడి రేణువులతో ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఈ చెట్లను వెంటనే తొలగించండి. చెట్లను నరికి వేయకుండా వేర్లతో సహా తీసివేయాలి. కొన్నిచోట్ల సగం వరకు చెట్లను నరికి వదిలారు. నీరు పోయడం వల్ల ఆ చెట్లు పెరుగుతున్నాయి - స్థానికులు
షోకేజ్ కోసం ఆ చెట్లు పెంచుతున్నారా? - ఆకర్షణీయం వెనక అనేక అనర్థాలు!