ETV Bharat / state

మార్క్‌ శంకర్‌తో హైదరాబాద్‌ చేరుకున్న పవన్‌ కల్యాణ్​ - 'ఎక్స్' వేదికగా పోస్ట్‌ - PAWAN KALYAN WITH MARK SHANKAR

మార్క్‌ శంకర్‌ కోలుకోవడంతో కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ వచ్చిన పవన్‌ - చిన్నకుమారుడి ఆరోగ్య పరిస్థితిపై 'ఎక్స్' వేదికగా పవన్‌ కల్యాణ్‌ పోస్ట్‌

pawan kalyan with mark shankar
pawan kalyan with mark shankar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 13, 2025 at 12:47 PM IST

2 Min Read

Pawan Kalyan With Mark Shankar: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​, కుమారుడు మార్క్‌ శంకర్‌తో సింగపూర్ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 8వ తేదీన మార్క్‌ శంకర్‌కు సింగపూర్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలికి, చేతులకు గాయాలయ్యాయి. అక్కడ కేకే మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఆసుపత్రిలో మార్క్‌ శంకర్‌కు వైద్యం అందించారు. సింగపూర్​లోని రివర్‌ వ్యాలీ ప్రాంతంలోని టమాటో కుకింగ్‌ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

మార్క్‌ శంకర్​కు ఊపరితిత్తుల్లోకి దట్టమైన పొగ చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​తో ఫోన్‌లో మాట్లాడి జరిగిన ఘటన గురించి తెలుసుకోవడంతో పాటు సింగపూర్‌లోని భారత హై కమిషనర్‌తో మాట్లాడారు. భారత హై కమిషనర్‌ కార్యాలయం నేరుగా మార్క్‌ శంకర్‌ వైద్య సేవలను పర్యవేక్షించింది. సింగపూర్‌ ఆసుపత్రిలో 5 రోజుల పాటు వైద్య సేవలు పొందిన తరువాత నిన్న అర్ధరాత్రి సింగపూర్‌ నుంచి పవన్‌ కల్యాణ్​, తన కుమారుడు మార్క్‌ శంకర్‌, సతీమణి అన్నా లెజినోవాతో పాటు హైదరాబాద్‌ చేరుకున్నారు.

మార్క్‌ శంకర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది: ఇవాళ అన్నా లెజినోవా శ్రీనివాసుడికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుపతి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తన కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్నిప్రమాదం నుంచి బయటపడినందుకు స్వామి వారికి మొక్కులు తీర్చుకోనున్నారు. చిన్నకుమారుడు మార్క్​ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్‌ కల్యాణ్‌ 'ఎక్స్' వేదికగా పోస్ట్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మార్క్‌ శంకర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని పవన్‌ కల్యాణ్ చెప్పారు.

ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు: మార్క్‌ శంకర్‌ క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచారని, సింగపూర్‌లోని అధికారుల ద్వారా అందించిన సహాయం మరువలేనిదన్నారు. క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయన్న పవన్‌, ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తాను విశాఖ మన్యంలోని అడవితల్లి బాట కార్యాక్రమంలో ఉండగా తనకు ప్రమాద సమాచారం అందిందని, సకాలంలో జోక్యం చేసుకుని తన కుటుంబానికి అపారమైన శక్తిని, ఉపశమనాన్ని కలిగించారంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

మార్క్​ శంకర్​ను కాపాడిన భారతీయ కార్మికులు - సింగపూర్​ ప్రభుత్వం సత్కారం

'ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్'- పవన్ కుమారుడు కోలుకోవాలని ఎన్టీఆర్ పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.