Pawan Kalyan Son Mark Shankar Injured in Singapore School Fire Accident : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో బాలుడి కాళ్లు, చేతులకు గాయాలు కావడం ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ వెళ్లిన పవన్ ఆస్పత్రికి చేరుకున్నారు. మార్క్‌శంకర్‌ను చూసిన అనంతరం వైద్యులతో ఆయన మాట్లాడారు.
మార్క్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు పవన్‌కు తెలిపారు. మార్క్ శంకర్‌కు తొలుత అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు బుధవారం ఉదయం గదికి తీసుకొచ్చారు. మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్, సోదరుడు చిరంజీవి దంపతులు విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు.
పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్ - కుమారుడి ఆరోగ్యంపై ఆరా
వేగంగా స్పందించిన నిర్మాణ కార్మికులు : సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్‌లో గల ఓ మూడంతస్తుల భవంతిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో కుకింగ్ స్కూలు, థియేటర్ల సముదాయం, చిన్నపిల్లలకు రోబోటిక్ సాంకేతికతను నేర్పే సంస్థ ఉన్నాయి. రెండు, మూడు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ సమ్మర్ క్యాంపులో ఉన్న 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. వారిలో పదేళ్ల బాలిక మరణించినట్లు సింగపూర్ హోంమంత్రి షణ్ముగం ప్రకటించారు. ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు ఏడేళ్ల మార్క్ శంకర్ గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు సింగపూర్ పౌర భద్రతా దళం ఫేస్‌బుక్‌లో ప్రకటించింది. ప్రమాదానికి కారణాలు నిర్ధారణ కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
అగ్నిప్రమాదం వల్ల మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది : పవన్ కల్యాణ్
మాటిచ్చాను - గిరిజనులను కలిశాకే సింగపూర్‌కు వెళ్తా: పవన్ కల్యాణ్