Pawan kalyan Mark Shankar Health : సింగపూర్‌లోని ఓ సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంప్‌నకు వెళ్లగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్‌కు గాయాలైనట్లు పేర్కొన్నారు. తాను అరకు పర్యటనలో ఉండగా ఈ విషయం గురించి ఫోన్ వచ్చిందన్నారు.
సమ్మర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం జరిగి తన కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని పవన్ పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వల్ల వైద్యులు బ్రాంకోస్కోపీ చేస్తున్నారని చెప్పారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంప్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు. తన భార్య పిల్లలు సింగపూర్‌లోనే ఉంటున్నారని వారు ఉంటున్న చోటుకి 10 నిమిషాల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
అగ్ని ప్రమాదం చిన్నదే అనుకున్నామని కానీ తర్వాత దాని తీవ్రత తెలిసిందని పేర్కొన్నారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమన్నారు. మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని అన్నారు. మరోవైపు తన కుమారుడు పక్కన కూర్చున్న చిన్నారి మరణించడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకొని అవసరమైన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారని చెప్పారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan Son Fire Accident : తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు, జనసేన కార్యకర్తలకు ఆయన పేరుపేరున థ్యాంక్స్ చెప్పారు. ఈ రాత్రి 9:30 గంటల ప్లైట్‌కు సింగపూర్ బయల్దేరనున్నట్లు పవన్ వెల్లడించారు.
"సమ్మర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. పెద్దకుమారుడి పుట్టినరోజే రెండోకుమారుడికి ఇలా జరగడం బాధాకరంగా ఉంది. అవసరమైన సహాయం చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారు. మార్క్‌శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన అందరికి ధన్యవాదాలు. - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం- పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు - PAVAN KALYAN SON FIRE ACCIDENT
మాటిచ్చాను - గిరిజనులను కలిశాకే సింగపూర్‌కు వెళ్తా: పవన్ కల్యాణ్