ETV Bharat / state

హైదరాబాద్​లో పార్థీ గ్యాంగ్​ గంధం చెక్కల చోరీ - నలుగురి మహిళల అరెస్ట్ - PARTHI GANG IN HYDERABAD

పార్థి గ్యాంగ్‌ను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు - గంధపు చెక్కల దొంగతనాలకు పాల్పడిన ముఠా - నిందితులు గుజరాత్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన వారని వెల్లడి

JUBILEE HILLS POLICE
JUBILEE HILLS POLICE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 13, 2025 at 11:18 PM IST

1 Min Read

Parthi Gang Theft In Hyderabad : పార్థి గ్యాంగ్‌కు చెందిన గంధపు చెక్కల దొంగలను హైదరాబాద్​లో జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. యూసఫ్‌గూడలోని ఎన్​ఐ- ఎమ్​ఎస్​ఎమ్​ఈ క్యాంపస్‌లో గంధపు చెక్కలు చేయడంతో పలాన్‌బాయి, షహ్నాజ్‌బాయి, నిమత్‌బాయి, మాధురి ఆదివాసీ అనే నలుగురు మహిళల్ని అరెస్టు చేశారు. 20 రోజుల క్రితం 23 మంది పార్థి గ్యాంగ్‌ సభ్యులు హైదరాబాద్​ నగరానికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులందరూ గుజరాత్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన వారని వెల్లడించారు.

పిల్లలు, మహిళల్ని ముందు పెట్టి : ముఠా సభ్యులు జూబ్లీహిల్స్, మధురానగర్‌ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గంధపు చెక్కల దొంగతనాలకు పాల్పడుతున్నారని, వాటిని పరిచయస్థులైన స్థానిక స్మగ్లర్లకు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా పిల్లలు, మహిళల్ని ముందు పెట్టి ఈ వ్యవహారాన్ని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇన్​స్టాగ్రామ్​లో ప్రేమ- ప్రియుడితో కలిసి సొంతింట్లోనే దొంగతనం!

చింతపండు చోరీ వెనక పెద్ద స్కెచ్ - ఐదు నెలలుగా కొనసాగుతున్న దందా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.