ETV Bharat / state

'సర్టిఫికెట్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే' - వీడియో కాల్​లో అడ్డంగా బుక్​ అయ్యాడుగా! - PANCHAYAT SECRETARY HARASSED WOMAN

డెత్ సర్టిఫికెట్ కోసం వెళ్లిన మహిళపై పంచాయతీ కార్యదర్శి లైంగిక వేధింపులు - వీడియో రికార్డు చేసి అధికారులకు చూపించి న్యాయం చేయాలని కోరిన బాధితురాలు

panchayat_secretary_harasses_woman
panchayat_secretary_harasses_woman (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 8:40 PM IST

Panchayat Secretary Harasses Woman: అక్కడ, ఇక్కడ కాదు ఎక్కడైనా మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కొంతమంది మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అవసరం కోసం బయటకు వచ్చిన మహిళలను లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా అలాంటి వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కొంతమంది ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

డెత్ సర్టిఫికెట్ కావాలంటే నా కోరిక తీర్చాల్సిందే. ఇది ఎక్కడో కాదు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఘటన. గిరిజన మహిళను 3 నెలలుగా వేధిస్తున్న ఘటన ఇది. పంచాయతీ కార్యదర్శి వేధింపులు తాళలేక వీడియో రికార్డు చేసి అధికారులకు చూపించి న్యాయం చేయమని బాధితురాలు కోరారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్​కి బాధితురాలు ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రాపూరు మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన కాలనీకి చెందిన మల్లిక నాగలక్ష్మి తండ్రి అయిన శంకరయ్య డెత్ సర్టిఫికెట్ అడిగితే శారీరకంగా తన కోరిక తీర్చాలని రాపూరు పంచాయతీ కార్యదర్శి చెంచయ్య వేధిస్తున్నాడని బాధితులు వాపోయారు. సర్టిఫికెట్​ అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడని పర్సనల్​గా వచ్చి మాట్లాడమని పదే పదే వేధించేవాడని బాధిత మహిళ వాపోయారు.

కోరిక తీరిస్తే నిమిషాల వ్యవధిలో సర్టిఫికెట్: ఫోన్​ చేసి శారీరకంగా తన కోరిక తీరిస్తే నిమిషాల వ్యవధిలో సర్టిఫికెట్ ఇస్తానని చెప్పేవాడని తెలిపారు. చివరకు ఎన్నిసార్లు ప్రాధేయపడినా నన్ను వీడియో కాల్​లో చూడాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడని వివరించారు. గూడూరులోని, మాలవ్యనగర్ నందు డబుల్ బెడ్రూం ఉందని అక్కడకు రావాలని అడుగుతున్నాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అతనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

"మనుషులున్నారు జాగ్రత్త!" - రోడ్డుపైకి రావడమే తను చేసిన పాపం!

దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం: ఒంటరిగా జీవిస్తున్న దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న ఒక దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వైఎస్సార్​సీపీ కార్యకర్త రామాంజనేయులు అనే వ్యక్తి ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉద్యోగం కావాలంటే కమిట్​మెంట్​ ఇవ్వాల్సిందే: ఉద్యోగం కోసం వచ్చిన మహిళకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్న ఘటన హైదరాబాద్​లోని నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ మల్లాపూర్‌ బ్రాంచ్‌లో స్థానికంగా ఉండే ఓ మహిళ ఉద్యోగం కోసం వెళ్లారు. ఈ క్రమంలో ఆ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న నగేశ్‌ అనే వ్యక్తి ఆ మహిళకు జాబ్‌ ఇప్పిస్తానని అందుకు తనకు కమిట్‌మెంట్‌ ఇవ్వాలని వేధింపులకు దిగాడు.

ఈ ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే లిస్టు చాలా పెద్దగా ఉందని మహిళకు తెలిపారు. వారందరికి కాకుండా ఆ ఉద్యోగం ఆమెకే రావాలంటే తనకు కమిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాడు. బాధిత మహిళ ఈ విషయం తన భర్తకు తెలియజేయడంతో ఎగ్జిక్యూటివ్‌ నగేశ్‌పై నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేశ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

"చెన్నై ఎక్స్​ప్రెస్ మర్డర్ స్టోరీ" - తండ్రీ, కూతురు కలిసి మృతదేహాన్ని ముక్కలు కోసి!

భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారు: పవన్‌ కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.