Paidi Lakshmaiah Awards in Hyderabad : సమాజానికి అంకిత భావంతో సేవలు అందించే మానవతావాదులను ప్రోత్సహించడంతోపాటు అభినందించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ పూర్వ కార్యదర్శి, పద్మభూషణ్ కె.పద్మనాభయ్య అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ తాగారాయ గాన సభలో రసమయి, డాక్టర్ పైడి లక్ష్మయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ పైడి లక్ష్మయ్య డాక్టర్ పిఎల్ సంజీవరెడ్డిల స్మారక పురస్కారాలను కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కెవి చౌదరి, వసుద ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రామరాజు, ప్రముఖ సంగీత విద్వాంసులు నామ చంద్రబాబు నాయుడు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ శరత్ జోత్స్నా రాణిలకు ప్రధానోత్సవం జరిగింది.
సమాజానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ దాతృత్వంతో సేవలు అందించడం ప్రశంసనీయమని అన్నారు. పైడి లక్ష్మయ్య, పీఎల్ సంజీవరెడ్డిల మార్క పురస్కార గ్రహీతలు తమ బాధ్యతగా అనేక రంగాల్లో సేవలందిస్తూ సమాజ పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. పైడి లక్ష్మయ్య, ఎస్ఎల్ సంజీవరెడ్డిలు ప్రజా మనుష్యులని ఇన్ కమ్ టాక్స్ మాజీ చీఫ్ కమిషనర్ ఎం.నరసింహప్ప పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో సేవలందించిన నేపథ్యంలో నాడు దివాన్ బహదూర్‌ను తిరస్కరించారని ఆయన వివరించారు.
పైడి లక్ష్మయ్య ఎంపీగా మొట్టమొదటిసారిగా ఎన్నికైన సమయంలో ప్రధానంగా వ్యవసాయంపై పార్లమెంట్లో ప్రస్తావించారని, 8 సంవత్సరాల పాటు దేవాదాయ శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారని ఎం.నరసింహప్ప గుర్తు చేశారు. శ్రీశైలం అందించిన సేవలు అజారామరామని ఆయన పేర్కొన్నారు. అనేక సంస్కరణలను తీసుకువచ్చిన పీహెచ్ సంజీవరెడ్డి తనకు రోల్ మోడల్ అని తెలిపారు. సమగ్రత, సమైక్యతను పాటించారని గుర్తు చేశారు. విప్లవాత్మక మార్పులకు సంజీవరెడ్డి నాంది పలికారన్నారు. సుమలత శిష్య బృందము, రేణుక ప్రభాకర్ శిష్య బృందం చేసిన పలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పిల్లలూ - శాస్త్రవేత్తలుగా ఎదగాలనుందా? - ఈ 'ఇన్స్పైర్ మనక్' అవార్డుల పోటీలు మీ కోసమే
గద్దర్ అవార్డులు స్వయంగా వచ్చి తీసుకోలేరా?- సినీ పరిశ్రమ తీరుపై దిల్ రాజు అసంతృప్తి!