Accident On Kollur Outer Ring Road : సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని టెంపోలో వాహనం ఓవర్‌టేక్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణానికి చెందిన ఓ కుటుంబాన్ని తన టెంపో వాహనంలో తిరుపతి తీసుకెళ్లేందుకు మాదయ్య అనే వ్యక్తి బేరం కుదుర్చుకున్నాడు.
అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి : వారిని తిరుపతి తీసుకెళ్లే క్రమంలో సంగారెడ్డి జిల్లా కొల్లూరు బాహ్య వలయ రహదారిపై వెళ్తూ ముందున్న వాహనాన్ని అధిగమించబోయి డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో టెంపో వాహనాన్ని నడుపుతున్న వాహన యజమాని మాదయ్య అక్కడక్కడే దుర్మరణం పాలవగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కొల్లూరు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను మాదాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారును ఢీ కొట్టిన లారీ : జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ మండలం రాఘవపూర్ వద్ద కారును లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు.
ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ప్రమాదం - ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం - పదో తరగతి విద్యార్థిని దుర్మరణం