No Confidence Motion on GVMC Deputy Mayor: విశాఖ జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ జియాన్ని శ్రీధర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం సాధించింది. 74 మంది సభ్యులు జియాన్ని శ్రీధర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది కూటమి కార్పొరేటర్లతో పాటు 11 మంది ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతో ఈ గెలుపు లభించింది.
డిప్యూటీ మేయర్ జియాన్ని శ్రీధర్ అవినీతి అరచకానికి చరమ గీతం పాడామని కూటమి కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో కనీసం వీధి లైట్లు లేవని, మళ్లీ కూటమి సారథ్యంలో జీవీఎంసీలో ప్రజలు చక్కటి పాలన చూస్తారని కూటమి కార్పొరేటర్లు అన్నారు. ఇటీవల కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో, మేయర్ సైతం పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.