ETV Bharat / state

నిజాం కళాశాలలో చీకట్లోనూ కొనసాగుతున్న యూజీ విద్యార్థినుల ఆందోళన - Nizam College Students Protest

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 10:35 PM IST

Nizam College Students Protest For Hostel : హైదరాబాద్ నిజాం కళాశాలలో యూజీ విద్యార్థినుల ఆందోళన మరింత ఉధృతం అవుతోంది. ప్రిన్సిపాల్ తమ పోరాటాన్ని పట్టించుకోకుండా హాస్టల్​లోని సగం సీట్లు పీజీ విద్యార్థులకు కేటాయిస్తూ సర్క్యులర్ జారీ చేయడంపై ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ధర్నా చేపట్టిన విద్యార్థులు అర్థరాత్రి అవుతున్నా కొనసాగిస్తున్నారు.

NIZAM COLLEGE PROTEST FOR UG HOSTEL
Nizam College Students Protest For Hostel (ETV Bharat)

Nizam College Students Protest For Hostel Facilitiy : బషీర్​ బాగ్​లోని నిజాం కళాశాలలో పీజీ విద్యార్థినులకు హాస్టల్ కేటాయింపు వివాదం రోజురోజుకు ముదురుతోంది. యూజీ విద్యార్థులకు కాకుండా పీజీ విద్యార్థినులకు హాస్టల్​ కేటాయిస్తే ఊరుకునేది లేదంటున్న విద్యార్థినులు ఇవాళ రోజంతా ఆందోళన కొనసాగించారు. ప్రిన్సిపల్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అర్థరాత్రి అవుతున్నా తమ పోరాటం కొనసాగిస్తున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ తమ డిమాండ్లను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినిలకు 50%, పీజీ విద్యార్థినులకు 50% కేటాయిస్తామని సర్కులర్ విడుదల చేశారని విద్యార్థులు మండిపడ్డారు.

ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. సర్క్యూలర్​ను వెనక్కి తీసుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత 5 రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ప్రిన్సిపల్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు మండిపడుతున్నారు. సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే రేపు కాలేజీ ఆవరణలో వంటావార్పు చేపడతామని వారు హెచ్చరించారు. పీజీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందని, డిగ్రీ విద్యార్థులకు నిజాం కాలేజీ వసతి గృహంలోనే పూర్తి స్థాయిలో కేటాయించాలని అప్పటి వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

'కాలేజీలో కూడా లేకుండా లీవ్ ఉండి సర్క్యులర్ రిలీజ్ చేయడం పూర్తిగా తప్పు. మేము ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు. 100 శాతం యూజీ అమ్మాయిలకు మాత్రమే హాస్టల్​ కేటాయిస్తామని ప్రభుత్వం నుంచి గానీ అడ్మినిస్ట్రేషన్ నుంచి గానీ అధికారిక లేఖ వచ్చే వరకు ఉద్యమాన్ని విరమించుకోం. అర్ధరాత్రి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మరో రెండ్రోజుల కూడా ఇలానే కొనసాగిస్తాం. సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే రేపు కాలేజీ ఆవరణలో వంటావార్పు కూడా చేపడతాం. హాస్టల్ మొత్తం నిజాం యూజీ అమ్మాయిలకు వచ్చే వరకు పోరాటం చేస్తాం'- విద్యార్థినులు

రెండు రోజుల క్రితం కొందరు విద్యార్థులను అరెస్ట్ : రెండు రోజుల క్రితం కూడా హాస్టల్ సీట్లు మొత్తం తమకే కేటాయించాలంటూ బషీర్​ బాగ్ చౌరస్తాలో విద్యార్థినులు రాస్తారోకో చేపట్టారు. రద్దీ ఏరియా కావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు కొందరు విద్యార్థులను అరెస్ట్ కూడా చేశారు. తాము హాస్టల్ సీట్ల కోసం ఇంతగా పోరాడుతున్నా ప్రిన్సిపల్ మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు మండిపడుతున్నారు.

రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థినులు - హాస్టల్స్ కేటాయించాలని ధర్నా - Nizam College students Protest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.