Newly Married Couple Gets Letter From PM Modi : వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ నుంచి లేఖ అందడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకెల్తే మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన మద్దెల సుగుణ, శోభన్‌బాబు దంపతులకు కుమారుడు శివకుమార్, కూతురు గౌతమిలు ఉన్నారు. తండ్రి వారి చిన్నతనంలో మరణించారు. 2022 ఫిబ్రవరి 20న గౌతమికి బాపట్లకు చెందిన సుధీర్‌తో పెళ్లి జరిగింది.
తన పెళ్లికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తూ ఆమె పీఎం కార్యాలయానికి శుభలేఖను పంపించారు. పెళ్లికుమార్తె, కుమారుడు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయూరారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ అక్కడి నుంచి ప్రధాని సంతకంతో వారికి లేఖ వచ్చింది. శివకుమార్ 2025 మే 23న, జరిగిన తన పెళ్లికి ఆహ్వానిస్తూ అలాగే పెళ్లి పత్రికను పీఎమ్ ఆఫీస్‌కు పంపించారు. నూతన దంపతులను ఆశీర్వదిస్తూ మరోసారి ప్రధాని కార్యాలయం నుంచి గురువారం లేఖ అందినట్లు తల్లి సుగుణ తెలిపారు.
విపత్తు నిర్వహణపై ప్రధాని మోదీ- ఈ విషయంలో 29 దేశాలకు భారత్ సాయం!