ETV Bharat / state

రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగేలా కొత్త రైల్వే లైన్ - NEW RAILWAY LINE

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 10:13 PM IST

New Railway Line Between Pandurangapuram to Malkangiri: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మంచి జరిగేలా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాండురంగాపురం - భద్రాచలం - మల్కన్​గిరి కొత్త రైల్వే లైన్ గిరిజన ప్రాంతాల ద్వారా రైలు మార్గాన్ని అందిస్తుందని విజయవాడ డీఆర్​ఎం తెలిపారు.

New Railway Line
New Railway Line (ETV Bharat)

New Railway Line Between Pandurangapuram to Malkangiri: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు చేకూర్చేలా కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజరు (DRM) నరేంద్ర పాటిల్ తెలిపారు. పాండురంగాపురం - భద్రాచలం - మల్కన్​గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఈ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును గిరిజన ప్రాంతాల ద్వారా రైలు మార్గాన్ని అందిస్తూ, ఇది అసన్సోల్, వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉంటుందని డీఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ జునాగర్హ - నబరంగ్పూర్ - జీపూర్ - మల్కన్​గిరి - భద్రాచలం - పాండురంగాపురం మధ్య అనుసంధానంను అందజేస్తుందన్నారు. 290 కిలోమీటర్ల మేర 7 వేల 383 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే లైన్​ను చేపడతారన్నారు.

ఇది ఉత్తర, తూర్పు భారతదేశానికి అదనపు రైలు కారిడార్‌గా నిలుస్తుందని, దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును వేగంగా చేరవేయడానికి, అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంలో ప్రయోజనకారిగా సహాయపడుతుందన్నారు. విజయవాడ - విశాఖపట్నం - భువనేశ్వర్ - కోల్‌కతా కోస్తా తీర ప్రాంతానికి నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ - భద్రాచలం - మల్కన్​గిరి - జయ్‌పూర్ - టిట్లాగఢ్‌కు అదనపు రైలు మార్గాన్ని అందిస్తుందన్నారు.

రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్​ ఆధునీకరణ- ప్రపంచస్థాయి సౌకర్యాలతో ప్లానింగ్ - Rajahmundry Railway Station

విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా: కొత్త రైల్వే లైన్ విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తుఫానుల సమయంలో హావ్​డా - విజయవాడ తీర మార్గంలో ప్రస్తుతం ఉన్న మార్గాల అనుసంధానం దెబ్బతింటే ఈ ప్రత్యామ్నాయ కొత్త రైల్వే లైన్ ఒడిశాలోని వివిధ జిల్లాలకు అనుసంధానాన్ని అందిస్తుందని, ఆయా ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటును సులభంగా అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

ఈ కొత్త రైల్వే లైన్ ద్వారా బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశానికి 124 కి.మీ దూరం తగ్గుతుందని, రాజమండ్రి - విశాఖపట్నం వంటి రద్దీ కారిడార్‌లను దాటవేస్తూ ప్రత్యామ్నాయ మార్గంగా కూడా పని చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కోటి పని దినాల ఉపాధిని సృష్టిస్తుందని, 3 కోట్ల 80 లక్షల చెట్ల పెంపకానికి సమానమైన 267 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని తెలిపారు.

కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్‌కు కేంద్రం రూ.125 కోట్లు కేటాయింపు - Kotipalli Narsapur Railway Project

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.