100 Bed Hospital in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలో నూతనంగా నిర్మించే వంద పడకల ఆసుపత్రికి ఈనెల 13న మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నమూనాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళగిరి జాతీయ రహదారి పక్కన సుమారు పది ఎకరాల ప్రాంతంలో దీనిని నిర్మించనున్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే ఆసుపత్రిని పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కార్ ఉంది.
సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ఇదే నెల 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30 పడకల ఆసుపత్రికి భూమిపూజ చేశారు. మళ్లీ ఆయన మనవడు నారా లోకేశ్ నూతన హాస్పిటల్ నిర్మాణానికి ఇదే నెలలో శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోతోందని మంగళగిరి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల 30 ఏళ్ల కల - వంద పడకల ఆసుపత్రి దేశానికి రోల్ మోడల్ కావాలి : మంత్రి లోకేశ్
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ - ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: చంద్రబాబు