ETV Bharat / state

కూటమి ఘన విజయానికి ఏడాది - రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు - NDA ONE YEAR CELEBRATIONS

రాష్ట్రంలో ఘనంగా 'సుపరిపాలన మొదలై ఏడాది' కార్యక్రమం - కేకులు కోసి సంబరాలు చేసుకున్న కూటమి నేతలు

NDA One year Celebrations
NDA One year Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 4, 2025 at 7:49 PM IST

3 Min Read

NDA ONE YEAR CELEBRATIONS: కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 'సుపరిపాలన మొదలై ఏడాది' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న కూటమి నేతలు కేక్‌లు కోసి సందడి చేశారు. 'పీడ విరగడై ఏడాది' పేరుతో మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం ఆవరణలో వీర మహిళలు ముగ్గులు వేశారు.

చరిత్ర సృష్టించిన రోజు: జూన్ 4వ తేదీన ప్రజల తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజని ఆయన గుర్తుచేశారు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజని చంద్రబాబు వెల్లడించారు. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణాన్ని బాధ్యతగా భావించి రోజూ పని చేస్తున్నామన్న సీఎం, వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలన గాడిలో పెట్టామన్నారు.

కూటమి ఘన విజయానికి ఏడాది పూర్తి - రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు (ETV Bharat)

స్వర్ణాంధ్ర- 2047 దిశగా నడిపిస్తున్నాం: 2024 జూన్ 4వ తేదీ భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజని పవన్ కల్యాణ్ అన్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ అరాచక పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజని వెల్లడించారు. ప్రజా తీర్పునకు, చైతన్యానికి ఏడాది పూర్తయ్యిందన్నారు. కూటమి చారిత్రక విజయానికి ఏడాది గడిచిందని గుర్తుచేశారు. గత తప్పిదాలను సరిచేస్తూ భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర- 2047 దిశగా నడిపిస్తున్నామన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంస పాలనపై ప్రజలు గెలిచారని మంత్రి లోకేశ్ అన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు పార్టీల కలయిక: ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చే కొత్త శకానికి నాంది పలికిన రోజని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏడాది క్రితం మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకంతో ఎన్డీఏ కూటమికి అద్భుతమైన మద్దతు ఇచ్చారని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రజలు వైఎస్సార్సీపీ అరాచక పాలనకు పాడెకట్టి, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన మంచిరోజు ఇదంటూ మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించామని స్పష్టం చేశారు. మూడు పార్టీల కలయిక రాష్ట్రాభివృద్ధి కోసమే తప్ప స్వార్థం కోసమో, పదవుల కోసమో కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. విజయవాడ స్క్రూబ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ ప్రాంగణంలో వార్షికోత్సవం నిర్వహించారు.

కూటమి నేతల సంబరాలు: తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమినేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ చేపట్టారు. గొడ్డలి వేటు జగన్‌దే అనే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా పాణ్యాం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తూ ఏడాది పాలనను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులోని కార్యాలయంలో అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేశారు. కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి, కేక్‌ కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని లక్ష్మీగణపతి ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సత్య ప్రమాణం నిలిచిన రోజు' పేరుతో కార్యక్రమం చేపట్టారు. విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో మహిళా నేతలు సంబరాలు చేసుకున్నారు. సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు సందడి చేశారు. మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయం ముందు వీర మహిళలు రంగవల్లులు వేశారు.

జూన్‌ 4 భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు: పవన్ కల్యాణ్​

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.