ETV Bharat / state

బట్టలపై లిప్‌స్టిక్‌ మరకలా? - ఈ 'ఇంటి' చిట్కాలతో ఇట్టే తొలగిపోతాయి - TIPS TO REMOVE LIPSTICK STAINS

బట్టలపై లిప్‌స్టిక్ మరకలా - ఎంత ఉతికినా పోవడం లేదా - ఈ టిప్స్‌ పాటిస్తే ఇదివరకటిలా మెరిసిపోతాయి

Tips in Telugu For Removing Lipstick Stains From Clothes
Tips in Telugu For Removing Lipstick Stains From Clothes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 17, 2025 at 2:40 PM IST

2 Min Read

Tips in Telugu For Removing Lipstick Stains From Clothes : రోజూ మేకప్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా లిప్‌స్టిక్ పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఒక్కోసారి లిప్‌స్టిక్ ఎక్కువైందని తూడ్చుకోవడమో లేక అప్లై చేసుకునేటప్పుడు పొరపాటున దుస్తులకు అంటుతుంది. ఇలా దుస్తులపై పడిన లిప్‌స్టిక్‌ మరకలు ఓ పట్టాన వదలవు. ఇలాంటప్పుడు ఇంటి చిట్కాలు పాటిస్తే మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

  • దుస్తులపై పడిన లిప్‌స్టిక్‌ మరకల్ని హ్యాండ్‌ శానిటైజర్‌తో తొలగించవచ్చు. మరకలు పడిన చోట కొద్దిగా శానిటైజర్‌ని స్ప్రే చేసి, పొడి క్లాత్‌ రబ్‌ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే మరకపోతుంది.
  • షేవింగ్‌ క్రీమ్‌ తోనూ దుస్తులపై పడిన మొండి లిప్‌స్టిక్‌ మరకల్ని వదలగొట్టచ్చట! ఇందుకోసం మరకలున్న చోట షేవింగ్‌ క్రీమ్‌ను పరచుకునేలా చేయాలి. ఆపై రుద్ది కాసేపు అలాగే వదిలేసి ఉతికేస్తే మరకలు పోతాయి.
  • డిష్‌ వాష్‌ లిక్విడ్‌, డిటర్జెంట్‌ వంటివీ దుస్తులపై లిప్‌స్టిక్‌ మరకల్ని వదలగొడతాయట! ఇందుకోసం మరకలు పడిన దుస్తులపై కొద్దిగా డిష్‌వాష్‌ లిక్విడ్‌/డిటర్జెంట్‌ని వేసి తడిగుడ్డతో రుద్ది ఆపై మామూలుగా ఉతికేయాలి.
  • నిమ్మరసం, బేకింగ్‌ సోడా సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని లిప్‌స్టిక్‌ మరకలు పడిన చోట అప్లై చేసి పొడి గుడ్డతో రుద్దాలి. ఆపై అరగంట పాటు వదిలేసిన తర్వాత చల్లటి నీళ్లు, డిటర్జెంట్‌తో శుభ్రం చేస్తే మరక పోతుంది.

హెయిర్‌స్ప్రే స్ప్రే చేసినా : లిప్‌స్టిక్‌ మరకలు పడిన చోట కొద్దిగా హెయిర్‌స్ప్రేను స్ప్రే చేయాలి. కాస్త తడిగా ఉన్న వస్త్రం లేదా పేపర్‌ టవల్‌తో మరకలపై రబ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల మరక క్రమంగా తొలగిపోవడం గమనించచ్చు. ఆపై చల్లటి నీటితో మరోసారి శుభ్రం చేస్తే మరకలు మాయమైపోతాయి.

ఉప్పు, వెనిగర్ సమానంగా తీసుకొని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరకలు పడిన చోట అప్లై చేసి పూర్తిగా ఆరేంత వరకు ఉంచాలి. ఆపై రుద్దడం వల్ల ఈ మిశ్రమంతో పాటు లిప్‌ స్టిక్‌ మరకలు కూడా పోతాయి. ఇప్పుడు సాధారణంగా దుస్తుల్ని ఉతికేస్తే ఫలితం ఉంటుంది.

షాంపూ : ఉన్ని దుస్తులపై పడిన లిప్‌స్టిక్‌ మరకల్ని తొలగించడానికి షాంపూ చక్కని పరిష్కారం. ఈ క్రమంలో మరకలున్న చోట షాంపూను అప్లై చేసి చేత్తో రుద్ది దీన్ని వాషింగ్‌ మెషీన్‌లోనైనా వేయచ్చు. లేదంటే చేత్తోనైనా ఉతికేస్తే మరకలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.