ETV Bharat / state

చీరాల ‘సిల్క్‌ చీర’కు జాతీయస్థాయి గుర్తింపు - జులై 14న దిల్లీలో అవార్డు ప్రదానం - CHIRALA KUPPADAM SAREES

చీరాల సిల్క్‌ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు - ఒక జిల్లా - ఒక ఉత్పత్తి, ఓడీపీ-2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపిక

Chirala Kuppadam Sarees
Chirala Kuppadam Sarees (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 13, 2025 at 7:28 PM IST

3 Min Read

Chirala Kuppadam Sarees : బాపట్ల జిల్లా చీరాల సిల్క్‌ చీరకు అరుదైన అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఒక జిల్లా - ఒక ఉత్పత్తి, ఓడీపీ-2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్‌ జె. వెంకటమురళి జులై 14న దిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు.

జనవరి నెలలో బాపట్ల విచ్చేసిన కేంద్ర బృందం సభ్యులు చీరాల ప్రాంతంలో మాత్రమే మగ్గాలపై నేసే కుప్పడం చీరలను పరిశీలించారు. ఈ మేరకు అవార్డుకు కుప్పడం చీరలు ఎంపికైనట్టు అధికారికంగా జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం సమాచారం అందింది. కుప్పడం చీరకు అవార్డు రావడంతో జిల్లాలో చేనేతలకు మంచి గుర్తింపు లభించిందని కలెక్టర్‌ వెంకటమురళి పేర్కొన్నారు.

కుప్పడంపట్టుకు ప్రత్యేక గుర్తింపు : బాపట్ల జిల్లా చీరాల చేనేత చీరలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అతివల మనస్సులు దోచే రకరకాల చీరలు చీరాల మండలం ఈపురుపాలెం, వేటపాలెం, జాండ్రపేట, పందిళ్లపల్లి ప్రాంతాల్లో నేతన్నల చేనేత మగ్గాల పై రూపు దిద్దుకుంటున్నాయి. అనేక రకాల చీరల్లో కుప్పడంపట్టు చీరకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఒకే జిల్లా-ఒకే ఉత్పత్తి (ఓడీఓపీ) కింద జాతీయ అవార్డు ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీలో జులై 14న నిర్వహించే జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో బాపట్ల కలెక్టర్ వెంకట మురళి పురస్కారం అందుకోనున్నారు.

దేశవ్యాప్తంగా ప్రాచుర్యం : సంప్రదాయ మగ్గాలపై నేసిన కుప్పడం చీరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తాజాగా కేంద్రం జాతీయ అవార్డు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందనుంది. చేనేతల కష్టం మూడున్నర దశాబ్దాల తర్వాత ఫలించింది. చీరాల చేనేత వస్త్రాలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో చీరాల-పేరాల ఉద్యమం ప్రముఖ పాత్ర పోషించింది. మహాత్మా గాంధీ పిలుపుతో ప్రజలు విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి స్థానిక నేత కార్మికులు నేసిన వస్త్రాలు ధరించి ఉద్యమంలో పాల్గొన్నారు. కొత్త రకం చీరల తయారీలో చీరాల ప్రాంత నేత కార్మికులు సిద్ధహస్తులు. ఈపూరుపాలేనికి చెందిన మాస్టర్ వీవర్ కూరపాటి సుబ్బారావు 1989-90 ప్రాంతంలో ఇక్కడి కార్మికులు కొందరిని ధర్మవరం తీసుకెళ్లారు.

కుప్పడం చీరల తయారీపై శిక్షణ ఇప్పించి ఇక్కడ తయారు చేయించారు. అందులో మెలకువలు నేర్చుకున్న కార్మికులకు చేతినిండా ఉపాధి దొరికింది. కాలానుగుణంగా ప్రస్తుతం పట్టు, జరీతో తయారు చేస్తున్నారు. చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కలెక్టర్ ప్రత్యేకచొరవ చూపారు. అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది జనవరి 9న జిల్లాకు వచ్చిన కేంద్ర బృందసభ్యులు ఇష్ దీప్, దివ్య డింగ్రాల ఎదుట ఒకే జిల్లా - ఒకే ఉత్పత్తి కింద కలెక్టరేట్లో కుప్పడం పట్టుచీరల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వాటి ప్రత్యేకత, ఉత్పత్తి, నేత కార్మికులజీవన స్థితిగతులపై కేంద్ర బృందానికి కలెక్టర్ నివేదిక అందజేశారు.

సతీమణి కోసం పట్టుచీర కొన్న సీఎం : జిల్లా చేనేత జౌళి శాఖ సహాయకుడు కె. నాగమల్లేశ్వ రావు ఆధ్వర్యంలో కేంద్ర బృంద సభ్యులు చీరాల వెళ్లి నేసిన చీరలను పరిశీలించి కార్మికులతో మాట్లా డారు. మగ్గాలపై చీరల తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. చీరలు, ఆకృతులు బాగున్నాయని నేతన్నల నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఒక్క చీరాల ప్రాంతంలోనే రోజుకు 2 వేల పైచిలుకు చీరలు తయారు కావడం విశేషం. ఏప్రిల్ ఒకటిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుకు చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పర్యటించిన సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో తన సతీమణి భువనేశ్వరి కోసం చీరాల కుప్పడం పట్టుచీరను ప్రత్యేకంగా కొని తీసుకెళ్లారు.

చీరాల చేనేత కుప్పడం పట్టుచీరకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చేనేత కార్మికులు తెలిపారు. తక్కువ రకాలకు కూలి ధర తక్కువ వస్తోందని ఇదే ఐదు కుప్పడం చీరలు నేసినందుకు 7 వేల రూపాయలు కూలి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆధునిక డిజైన్లు నేసి కుటుంబాలు ఆర్ధికంగా ఎదుగుతాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే గడ్డుపరిస్థితుల్లో ఉన్న చేనేత పరిశ్రమ ఆర్ధికంగా నిలదొక్కుకుని, చేనేత కొనుగోళ్లు పెరిగి ఆదాయం వృద్ధి చెందుతుందని నేతన్నలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మండుటెండల్లో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా పొందూరు నేత చీర - చేపముల్లే ప్రత్యేకం

రాజసానికీ ప్రతీక 'పొందూరు ఖద్దరు' - తయారీలో రాణిస్తున్న టింబక్టు మహిళలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.