NCW ON COMMENTS ON AMARAVATI WOMEN: అమరావతి మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మీడియాలో వచ్చిన కథనాలన్నీ సుమోటోగా తీసుకున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ లేఖలో పేర్కొంది.
మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలి: మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండించింది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజయ రహత్కర్ డీజీపీకి లేఖ రాశారు. దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ లేఖలో పేర్కొంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది.
The Commission has taken suo motu cognizance of media reports on alleged derogatory remarks made by journalist V.V.R. Krishnam Raju against Amaravati women during a TV debate. Referring to Amaravati as a “capital of prostitutes” is an outrageous insult to women farmers
— NCW (@NCWIndia) June 10, 2025
NCW…
రాయపాటి శైలజ కృతజ్ఞతలు: అమరావతి మహిళలపై చేసిన దారుణ వ్యాఖ్యలపై తక్షణమే స్పందించినందుకు జాతీయ మహిళా కమిషన్కు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను అవమానపరిచిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ డీజీపీకి లేఖ రాయడం రాష్ట్ర మహిళలందరికి ఆనందదాయకమన్నారు. మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడటంలో కమిషన్ కట్టుబడి ఉందన్న నమ్మకాన్ని మరింతగా పెంచిందని వెల్లడించారు.
రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే కొమ్మినేని - నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు