150 మిల్లీ గ్రాముల 'బంగారు' గాలిపటం - చూస్తే అవాక్కవ్వాల్సిందే!
సూక్ష్మ కళాకారుడి నైపుణ్యం - 150 మిల్లీ గ్రాముల బంగారు గాలిపటాన్ని తయారు చేసిన డా.ముంజంపల్లి విద్యాధర్
Munjampalli Vidhyadhar Made A 150 Milligram Gold Kite (ETV Bharat)

Published : January 14, 2025 at 11:53 AM IST
Munjampalli Vidhyadhar Made A 150 Milligram Gold Kite : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్లోని హస్తినాపురం సంతోషిమాత కాలనీకి చెందిన సూక్ష్మ కళాకారుడు డా.ముంజంపల్లి విద్యాధర్ స్వర్ణంతో కూడిన అతి చిన్న గాలిపటం, చరఖాను తయారు చేశాడు. సుమారు 150 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి, కేవలం 24 గంటల్లో వాటిని రూపొందించడం విశేషం. గతంలో కూడా ముంజంపల్లి విద్యాధర్ అనేక సూక్ష్మ కళాఖండాలను తయారు చేశాడు. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ రికార్డులనూ ఆయన సొంతం చేసుకున్నాడు.


