Mother and Son Died in Suryapet : తమ బాగోగులు చూసేవారే లేరంటూ మనస్తాపానికి గురైన తల్లీ కుమారుడు ప్రాణాలు తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని చిలుకూరు మండలం కొత్త కొండాపురానికి చెందిన వృద్ధురాలు బుడిగం వీరమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆమెకు కుమారుడు బుడిగం నాగేశ్వరరావు ఉన్నాడు. అతను పుట్టుకతోనే మూగవాడు. తండ్రి మరణించిన తర్వాత నాగేశ్వర రావు మానసిక స్థితి బాగుండడం లేదు. దీంతో వీరమ్మ, ఆమె కుమారుడు బాగోగులు సోదరుడు దొంగరి నాగేశ్వరరావు చూసుకుంటున్నారు. ఆమె ఆసుపత్రి ఖర్చులు, నాగేశ్వరరావు చికిత్సకు సహాయం చేస్తూ ఇద్దరికీ అండగా నిలిచాడు.
అప్పటికే వీరమ్మ సోదరుడు దొంగరి నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆ కారణంతో ఇటీవలే మృతి చెందాడు. దీంతో వారిని చూసుకునే వారే లేరని కుమిలిపోయింది వీరమ్మ. ఒకవైపు తన ఆరోగ్యం బాగోకపోవడం, మరోవైపు కుమారుడి మానసిక స్థితి, చూసుకునే సోదరుడు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. తాము బతికి ఉండి సాధించేది ఏముందని, ఇవన్నీ కాదనుకుని చావే మేలనుకుంది. సోమవారం అర్ధరాత్రి తన కుమారుడితో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్థులు మృతదేహాలు చూడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరణంలోనూ తోడు వీడని జంట - గంట వ్యవధిలో భార్యాభర్తల మృతి
తిరుపతికి త్వరగా వెళ్లాలని తొందర - ఓఆర్ఆర్పై ఓవర్టేక్ చేయబోయి ప్రమాదం