Mother and daughter suspicious Death : ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్లిన భర్తకు బిగ్ షాక్ తగిలింది. రెండు రోజుల తర్వాత రావడంతో భార్యా, బిడ్డలతో ఆనందంగా గడుపుదామనుకున్న అతనికి ఇంట్లోని పరిస్థితి చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. ఓ గదిలో కుమార్తె, మరో గదిలో భార్య విగతజీవులుగా మారారు. ఈ దారుణ ఘటన శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ఘటనపై స్థానికులు, డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన గుర్రం సీతారాం రెడ్డి ఓ ఫెర్టిలైజర్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. భార్య రాజేశ్వరి (34), ఇద్దరి కుమార్తెలతో కలిసి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. సంస్థ పని నిమిత్తం సీతారాం రెడ్డి ఈ నెల 10న హైదరాబాద్‌కు వెళ్లారు. శనివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి అప్పుడే నిద్ర లేచిన పెద్ద కుమార్తె గేట్ తీసి అమ్మా, చెల్లి నిద్రపోతున్నారని తెలిపింది.
మణికట్టు కోసుకుని, ఉరేసుకుని : వెంటనే ఇంట్లోకి వెళ్లిన సీతారాం చిన్న కుమార్తెను నిద్ర లేపాలి అనుకున్నాడు. ఈ క్రమంలో దుప్పటి తొలగించగా గొంతు కోసి ఉండటం గమనించాడు. మరో గది లోపలి నుంచి గడియా పెట్టి ఉండడంతో తలుగు పగలగొట్టి చూడగా రాజేశ్వరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కాసేపు షాక్‌కు గురై లబోదిబోమన్న సీతారాం రెడ్డి.. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేశ్వరి ఎడమ చేసి మణికట్టు వద్ద నరం కోసి ఉందని, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తల్లీకుమార్తెల మృతి సమాచారం అందుకున్న బంధువులు భారీగా ఇంటివద్దకు చేరుకున్నారు. వారి రోదనలను చూసి అక్కడి వారు కూడా కన్నీరు పెట్టుకున్నారు. భర్త ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
కల్లు తాగించి ఖతం చేస్తాడు - కాసుల కోసం క్రూర హత్యలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
పిల్లలు ఏడుస్తున్నా, చనిపోయే దాకా భార్యను కొట్టిన భర్త! పారిపోయినా వదల్లేదు!