IMD Weather Report In Visakhapatnam From Andhra Pradesh: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కశ్మీర్, సిమ్లా మీదుగా హిమాలయాల వరకూ విస్తరించాయి. మరో 2 లేదా 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. సాధారణం కంటే 15 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినట్లు ఐఎండీ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. సుమారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణశాఖ అధికారి రూప సూచించారు.
'ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు అనుకుని ఉన్న పశ్చిమ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఆవర్తనం ఏర్పడింది.ఈ ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల పైన ఆవరించి ఉంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతం అంతటా జల్లులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.' - రూప, విశాఖ వాతావరణ శాఖ అధికారి
ముందస్తు రుతుపవనాలతో ముప్పే! - ఈ ఏడాది వర్షాలు, తుపాన్ల ప్రభావం ఎలా ఉందంటే?
ఏపీలో 3రోజులు తేలికపాటి వర్షాలు - గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు