MLC Kavitha Protest : రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యకర్తలు బస్‌భవన్‌ను ముట్టడించి, పెంచిన ధరలను వెంటనే ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాసేపటి తర్వాత కవితను పోలీసులు విడిచిపెట్టారు.
పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్ ధరలు పెంచి సామాన్యులపై తీవ్రమైన భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ఆవేదన చెందారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు రూ.300లకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉందని వివరించారు. ప్రజలను దోచుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని తమ దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
"ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఈ ధరల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు సుమారు 300 రూపాయలకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు బడిపోయింది. విద్యార్థుల సౌకర్యార్థం అనేక మార్గాలలో తగినన్ని బస్సులు నడపడం లేదని మా దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి." - కవిత, ఎమ్మెల్సీ
కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్‌ఎస్ అయితే - రెండో కన్ను జాగృతి : ఎమ్మెల్సీ కవిత