Miss World Talent ROund Finals : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ శిల్పాకళా వేదికగా ముగిసింది. టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నెంబర్ వన్‌గా నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో మిస్ కామెరూన్, మూడో స్థానంలో మిస్ ఇటలీ నిలిచారు. మిస్ ఇండోనేషియా పియానో వాయించారు. మిక్ కామెరూన్ సింగింగ్‌లో ప్రతిభ కనబరిచారు. మిస్ ఇటలీ బ్యాలే నృత్యంతో ఆకట్టుకుని మూడో స్థానంలో నిలిచారు. అమెరికా కంటెస్టెంట్ నృత్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన రాను బొంబయికి రాను అనే తెలంగాణ పాటకు మిస్ నైజీరియా చేసిన ఇండో ఆఫ్రికన్ డాన్స్ బాగా ఆకట్టుకుంది.
ఫ్లోర్ డాన్స్ ద్వారా ఎస్టోనియా కంటెస్టెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐ లవ్ స్టోరీస్ అనే అద్భుత గీతం పాడి బ్రెజిల్ కంటెస్టంట్ అలరించారు. నెదర్లాండ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఐస్ స్కేటింగ్‌తో అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. చెక్ రిపబ్లిక్ సుందరీమణి కూడా పియానోతో తన ప్రతిభను ప్రదర్శించారు. అర్బన్ డాన్స్ మూవ్‌మెంట్స్‌తో అర్జెంటీనా కంటెస్టెంట్ ఆకట్టుకున్నారు. సంప్రదాయ సింహళీ నృత్యంతో మిస్ శ్రీలంక తన టాలెంట్‌ను ప్రదర్శించారు. ట్రినిటాడ్ కంటెస్టెంట్ ఏరోబిక్స్ ప్రదర్శనతో మెప్పించారు.

డోల్ బాజే సాంగ్‌తో అదరగొట్టిన నందిని గుప్తా : అందరికంటే భిన్నంగా తన టాలెంట్‌తో మెప్పించారు వేల్స్ కంటెస్టెంట్. అత్యవసరమైన సమయాల్లో రోగులను కాపాడే కార్డియో పల్మనరీ రెససిటేషన్ ఎలా చేయాలో వినూత్నంగా ప్రదర్శించారు. కెన్యా కంటెస్టెంట్ జుంబా డీజే ద్వారా ఉర్రూతలూగించింది. ఇక మన ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని డోల్ బాజే సాంగ్‌తో ఉర్రూతలూపింది. చివరగా మొత్తం ఇరవై నాలుగు మంది పోటీదారులు రాను బొంబాయికి రాను అంటూ తెలుగు పాటకి స్టేజి దద్దరిల్లే పెర్ఫార్మన్స్ చేశారు.
విక్టోరియా హోమ్‌ను సందర్శించిన ముద్దుగుమ్మలు - చీర, గోల్డ్ కాయిన్‌తో సత్కారం
శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌ల సందడి - బతుకమ్మ ఆడిన సుందరీమణులు
కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు