ETV Bharat / state

బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణుల ధ్యానం - BUDDHAVANAM IN NAGARJUNASAGAR

బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్దవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ అందాలభామలు - ఫోటో షూట్​తో సందడి చేసిన 22 మంది సుందరీమణులు

Buddhavanam in Nagarjunasagar
ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2025 at 8:52 PM IST

Updated : May 12, 2025 at 8:58 PM IST

1 Min Read

Miss World contestants at Buddhavanam : మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ బుద్ధవనంలో పర్యటించారు. వారికి గిరిజన, జానపద నృత్య కళాకారులు ఘనస్వాగతం పలికారు. వారంతా అక్కడి పరిసరాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. బౌద్ధ థీమ్‌పార్క్‌లోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫోట్​షూట్​లో : అంతకుముందు తెలంగాణ పర్యాటక సంస్థ విజయ్‌ విహార్‌లో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సుందరీమణులంతా ఫొటోషూట్‌లో పాల్గొని సందడి చేశారు. బుద్ధపూర్ణిమ సందర్బంగా వారంతా బుద్ధవన పర్యటనకు వచ్చినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఇండియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, కంబోడియా, మయన్మార్‌, వియత్నాం, జపాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, లెబనాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇండోనేసియా, మంగోలియా, నేపాల్‌, తుర్కియే, చైనా, థాయ్‌లాండ్‌, ఆర్మేనియా దేశాలకు చెందిన సుందరీమణులు ఇవాళ బుద్ధవనంకు వచ్చిన వారిలో ఉన్నారు.

'నీరా'​కు సుందరీమణులు ఫిదా - టేస్ట్ ఎలా ఉందన్నారంటే?

అట్టహాసంగా ప్రారంభమైన మిస్‌ వరల్డ్‌ పోటీలు - హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : May 12, 2025 at 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.