Miss World 2025 Contestants Buzzing At Shilparamam : ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైన విషయం తెలిసిందే. ఇలా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచ సుందరి పోటీల కోసం వివిధ దేశాల భామలు హైదరాబాద్కు చేరుకున్నారు.
మే 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే : తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ 2025 పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివెరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్‌లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అందులో భాగంగానే శిల్పారామాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ నేడు సందర్శించి సందడి చేశారు. మే 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. 31న జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయని స్పష్టం చేసింది.
సంప్రదాయ రీతిలో అందగత్తెలకు స్వాగతం : మిస్ వరల్డ్ కంటిస్టెంట్లు శిల్పారామంలో సందడి చేశారు. ఉదయం ఎనిమిదిన్నరకే శిల్పారామంకు చేరుకున్న ముద్దుగుమ్మలు దాదాపు రెండు గంటల పాటు శిల్పారామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆడి పాడారు. బతుకమ్మ ఆటలు ఆడుతూ ఆకట్టుకున్నారు. ముందుగా శిల్పారామంకు చేరుకున్న అందాల భామలకు అధికారులు సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం బగ్గీల విలేజ్ మ్యూజియంలో పర్యటించారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. ఆ తర్వాత బృందావనంలో బాలగోపాలుడు గోపికల ఆటలను తిలకించి పరవశించారు. బొమ్మలకు రంగులద్ది సరదాగా గడిపారు. మహిళా శక్తి బజార్లోని స్టాళ్లను చూసి, అక్కడ ఉన్న వివిధ రకాల ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మిస్ వరల్డ్ కంటిస్టెంట్స్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క, మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం అందాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదన్నారు. అందాల పోటీల వెనక అద్భుతమైన లక్ష్యం ఉంటుందని, ఒక పర్పస్ ఉంటుందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల వృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. శిల్పారామంలో పెట్టినవి కేవలం స్టాల్స్ కాదని, భవిష్యత్తుకు పునాది రాళ్లన్నారు.
మనల్ని మనం ప్రేమిస్తే ఎలాంటి లక్ష్యాలు అయినా చేరుకోవచ్చు : మిస్ బెల్జియం