ETV Bharat / state

మిస్‌ తెలుగు యూఎస్‌గా పోలవరం యువతి - టాలెంటెడ్‌ కేటగిరీలో ప్రథమస్థానం - MISS TELUGU USA 2025 WINNER

పోలవరం గ్రామానికి చెందిన నాగచంద్రికారాణి - అమెరికాలో ఎంఎస్‌ చేస్తున్న యువతి

Miss Telugu USA
Miss Telugu USA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2025 at 5:32 PM IST

1 Min Read

Miss Telugu USA 2025 Talented Winner: కృష్ణా జిల్లా గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన యువతి అమెరికాలో తన ప్రతిభతో మన్ననలు అందుకుంటోంది. పోలవరానికి చెందిన జాగాబత్తుల దుర్గాప్రసాద్, శ్రీవల్లి దంపతుల ఏకైక కుమార్తె నాగచంద్రికారాణి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎంఎస్‌ చదువుతోంది. ఈనెల 25వ తేదీన డల్లాస్‌లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మిస్‌ తెలుగు యూఎస్‌ఏ పోటీలు నిర్వహించారు. ఈ పోటీ నాగచంద్రికారాణి ఎంతో ఆసక్తితో పాల్గొంది.

టాలెంటెడ్‌ కేటగిరీలో అనేక మంది తెలుగు యువతులు పాల్గొనగా, నాగచంద్రికారాణి ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. చంద్రికారాణి ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఉయ్యూరులో, ఇంటర్, ఇంజినీరింగ్‌ విజయవాడలో పూర్తి చేసింది. 2023 సంవత్సరంలో ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లిందని, ఆగస్టులో పూర్తవుతుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా నాగచంద్రికారాణిని కుటుంబసభ్యులతోపాటు బంధువులు, గ్రామస్థులు అభినందించారు.

రామోజీ ఫిల్మ్​ సిటీని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.