ETV Bharat / state

'రోడ్లపై వర్షపు నీరు నిల్వలేకుండా చర్యలు - నగరంలో పార్కులు, రోడ్లు' - MINISTER NARAYANA REVIEW ON VMC

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష - విజయవాడ నుంచి విమానాశ్రయం వెళ్లేందుకు రోడ్ల కనెక్టివిటీ పెంచాలని ఆదేశాలు

Minister Narayana Review On VMC Development Works
Minister Narayana Review On VMC Development Works (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 17, 2025 at 8:43 PM IST

1 Min Read

Minister Narayana Review On VMC Development Works : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామమోహన్, బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరైయ్యారు. వీఎంసీ పరిధిలో ఉన్న సమస్యలు, అభివృద్ధి ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలువ లేకుండా ఉండేలా వరద నీటి కాలువల పనులు వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఎయిర్ పోర్ట్​కు కనెక్టివిటీ : మెప్మాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధుల సూచనలతో నగరంలో పార్కులు, రోడ్లు, ఇతర వసతుల కల్పనపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో నుంచి ఎయిర్ పోర్ట్​కు వెళ్లేందుకు రోడ్ల కనెక్టివిటీని పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలో మరో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం అవుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఎన్​హెచ్ అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ కారిడార్ రహదారిలో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.

ఉపాధి కోసం వెతుకుతున్నారా- ఉచితంగా ఆశ్రయం పొందండిలా

డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళన - ఇక వీఎంసీలో వరదలకు చెక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.