ETV Bharat / state

ప్రజల 30 ఏళ్ల కల - వంద పడకల ఆసుపత్రి దేశానికి రోల్‌ మోడల్‌ కావాలి : మంత్రి లోకేశ్‌ - MINISTER LOKESH ON 100 BED HOSPITAL

వంద పడకల ఆసుపత్రిపై మంత్రి లోకేశ్‌ సమీక్ష - మంగళగిరి సమీపంలోని చినకాకానిలో నిర్మించనున్న ఆసుపత్రి

Minister Lokesh Review On Mangalagiri 100 Bed Hospital
Minister Lokesh Review On Mangalagiri 100 Bed Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2025 at 8:12 PM IST

1 Min Read

Minister Lokesh Review On Mangalagiri 100 Bed Hospital : మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి దేశానికి రోల్‌ మోడల్‌ కావాలని మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. ఆసుపత్రి భవన నమూనాపై ఉండవల్లి నివాసంలో అధికారులతో లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా భవన నమునాను అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులకు లోకేశ్‌ పలు సూచనలు చేశారు.

దేశానికి రోల్ మోడల్​గా : మంగళగిరి ప్రజల 30 ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి అన్నారు. అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. వంద పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్ గా ఆసుపత్రి నిలవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలని, రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.

ఆధునిక వసతులతో : డాక్టర్లు, పేషెంట్లు, విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని తేల్చిచెప్పారు. పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సీఈ జి.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ వి.చిట్టిబాబు, ఈఈ సీవీ రమణ, భార్గవ్ గ్రూప్ చీఫ్ ఆర్కిటెక్చర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు.

28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి.. ఎక్కడో తెలుసా..!

వందపడకల ఆస్పత్రి, అదనపు పోస్టుల భర్తీ - కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.