Minister Nara Lokesh review on Mega DSC: విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలును జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డీఎస్సీ, పది, ఇంటర్మీడియట్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పనపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
'మనమిత్ర' యాప్‌లో ఫలితాలు: ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 10, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన 'మనమిత్ర' యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్‌ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్ర మంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపారని దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు
అన్నీ పారదర్శకంగా నిర్వహించాలి: జీఓ-117కు ప్రత్యామ్నాయ జీఓను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాలలు తెరిచేనాటికే పాఠ్యపుస్తకాలు అన్నీ సిద్ధం చేయాలని అలానే టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అమరావతిలో కేంద్రీయ గ్రంథాలయం, శిక్షణ అకాడమీ, మ్యూజియం నిర్మాణాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి సెలవులో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లోని టీచర్ల బదిలీలను పూర్తి చేసేందుకు మంత్రి అంగీకారం తెలిపారు.
అమరావతిలో సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ఏయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ సూచించారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, వర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వైస్ ఛాన్సలర్ రాజశేఖర్‌తో మంత్రి సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
క్యూఎస్ ర్యాంకింగ్‌లో వర్సిటీ టాప్-100లో స్థానం పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. త్వరలోనే వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఏడాదిపాటు కొనసాగుతాయని, ప్రారంభ వేడుకను ఏప్రిల్ 26న నిర్వహిస్తున్నామని మంత్రికి వీసీ చెప్పారు. వర్సిటీ విజన్‌ను మంత్రి లోకేశ్‌కు వీసీ వివరించారు.
కోలుకుంటున్న మార్క్ శంకర్ - సింగపూర్ ఆస్పత్రికి చేరుకున్న పవన్
ప్రజల వద్దకే పాస్‌పోర్ట్ సేవలు - ‘పాస్‌పోర్టు సేవా మొబైల్ వ్యాన్’ సిద్ధం