ETV Bharat / state

రాజకీయాల్లో ఎవరు స్ఫూర్తి? - విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సమాధానాలు - LOKESH MET WITH SSC MERIT STUDENTS

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించిన లోకేశ్​ - విద్యార్థుల సరదా ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానం

విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సమాధానాలు
విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సమాధానాలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2025 at 10:06 PM IST

Updated : May 21, 2025 at 9:26 AM IST

4 Min Read

Minister Nara Lokesh Met With SSC Merit Students : ఆంధ్రప్రదేశ్​లో విద్యాసంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని విద్యశాఖ మంత్రి నారా లోకేశ్​ తెలిపారు. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని కొనియడారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పదో తరగతి విద్యార్ధులు అడిగిన సరదా ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు.

పరీక్షలు కష్టమా? ఆ ప్రశ్నలు కష్టమా?: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్​ సన్మానించారు. షైనింగ్ స్టార్స్-2025 పేరుతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో విద్యార్థుల్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లోకేశ్​తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. పాఠశాలలో పరీక్షలు కష్టంగా ఉండేవా లేక అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా అంటూ విద్యార్ధి అడిగిన ప్రశ్నలు ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో ఎవరి నుంచి స్ఫూర్తి పొందారు, ఇష్టమైన కొటేషన్‌ ఏంటి, అదృష్టాన్ని నమ్ముతారా హార్డ్‌ వర్క్‌ను నమ్ముతారా అంటూ విద్యార్ధులు ప్రశ్నలు సంధించారు.

ఆ బాధ్యత తీసుకుంటా: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థుల నుంచి మంత్రి నారా లోకేశ్‌ అభిప్రాయాలు తీసుకున్నారు. కేవలం విద్యాభ్యాసమే కాకుండా గ్రంథాలయం, ప్రాక్టీకల్‌ అభ్యాసనకు సమయం కేటాయించాలని విద్యార్ధులు కోరారు. ప్యాసివ్‌ లెర్నింగ్‌ నుంచి యాక్టివ్‌ లెర్నింగ్‌కు తేవాలన్నదే తమ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. తమ గ్రామంలో రోడ్డు సరిగా లేదని, టీచర్లు, విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని పలువురు విద్యార్దులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటానని లోకేశ్​ హామీ ఇచ్చారు. వృత్తి విద్య కోర్సుల విద్యార్థులకు ల్యాబ్‌ సదుపాయాలు పెంచాలని విద్యార్థిని కోరారు. కేజీబీవీల్లో అమలు చేస్తున్న పంచతంత్ర విధానం బాగుందని ఓ విద్యార్థిని వెల్లడించారు. మధ్యాహ్న భోజనంలో అందించే వెజిటబుల్‌ బిర్యానీ, రాగిజావా సరిగా ఉండడం లేదని పలువురు విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

బోధన బాగుంది: మంత్రి నారా లోకేశ్​ను కలవడం పట్ల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న ప్రమాణాలను సద్వినియోగం చేసుకుంటూ అత్యుత్తమ మార్కులు సాధించామని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని కూడా ర్యాంకర్లు అవ్వొచ్చని, ఇక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని రుజువైందని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెరిగింది, రుచి కూడా బాగుందని చెప్పారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయన్నారు. మంత్రి లోకేశ్​ ప్రోత్సాహం వల్ల తర్వాతి తరాల పిల్లలు స్ఫూర్తి పొందుతారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ స్థాయిలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారని అన్ని సబ్జెక్టుల్లో బోధన బాగుందని స్పష్టం చేశారు.

యాక్షన్​ ప్లాన్​ సూపర్​: మంత్రి లోకేశ్​ చేతుల మీదుగా తమ పిల్లలు సత్కారం పొందడం చాలా ఆనందంగా ఉందని విద్యార్దుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సబ్జెక్టుల్లోని అనుమానాలను నివృత్తి చేసేవారని తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ బాగా ఉపయోగపడిందని చెప్పారు.

విద్యార్థుల మనోగతం: విద్యార్థులు జీవితంలో తమ లక్ష్యాన్ని వివరిస్తూ డ్రీమ్ వాల్​పై వారి మనోగతాన్ని తెలియజేశారు. ఐఎఎస్, ఏరోనాటికల్ ఇంజీనీర్, డాటా సైంటిస్ట్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, డాక్టర్ కావాలన్న తమ కలలను వారు రాశారు. గ్రాటిట్యూడ్ వాల్ పై జీవితంలో తమ ఉన్నతికి కృషిచేసిన తల్లిదండ్రులు, టీచర్ల పేర్లను రాశారు. విలువలపై అవగాహన పెంపొందించే వాల్యూస్ జంగా బ్లాక్ ద్వారా జీవితంలో తమ ప్రాధాన్యతలను వ్యక్తపరిచారు.

పదో తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు అడిగిన సరదా ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ ఉత్సాహంగా సమాధానాలిచ్చారు.

సంతోష్‌ (విద్యార్థి): మీకు స్కూలులో పరీక్షలు కష్టంగా ఉండేవా, అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా?

మంత్రి లోకేశ్‌: పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రోజూ మూడు ప్రశ్నలు వచ్చేవి. వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. స్కూల్‌ డేస్‌లో నేను లాస్ట్‌ బెంచి, మాది అల్లరి బ్యాచ్‌.

విద్యార్థిని: మీకు ఇష్టమైన కొటేషన్‌ ఏంటి?

మంత్రి: సీఎం చంద్రబాబు ‘డేర్‌ టు డ్రీమ్‌ స్ట్రెవ్‌ టు ఎచీవ్‌’ కోట్‌ నాకు ఇష్టమైంది.

సుచరిత: రాజకీయాల్లో ఎవరి నుంచి స్ఫూర్తి పొందారు?

మంత్రి: 2005లో చంద్రబాబుతో హైదరాబాద్‌లో ఒక వేడుకకు వెళ్లాను. ఆయనను చూడగానే అక్కడ ఉన్న 5 వేల మంది లేచి నిలబడ్డారు. రాజకీయాల్లో మంచి చేస్తే గౌరవం ఉంటుందని తెలుసుకున్నా.

అఫ్రిద్‌: మీరు అదృష్టాన్ని నమ్ముతారా, హార్డ్‌వర్క్‌ను నమ్ముతారా?

మంత్రి: జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కష్టపడి పని చేయడం ఒక్కటే మార్గం. ఈ విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నుంచి ప్రేరణ పొందాను.

మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా - ఇంటర్​ టాపర్స్​తో లోకేశ్​

500 సాధించారు విమానం ఎక్కారు - ఫలిస్తున్న టీచర్ల వినూత్న ఆలోచన

Last Updated : May 21, 2025 at 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.