Nara Lokesh is angry on YSRCP Activists behavior: ప్రజలు తుక్కుతుక్కుగా ఓడించి మూలన కూర్చోబెట్టినా వైఎస్సార్సీపీ సైకోలు తమ తీరు మార్చుకోవడం లేదని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో టీడీపీ నేత తాయన్న కుమారుడి పెళ్లి సందర్భంగా టీడీపీ పాటలు పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ పిల్ల సైకోలు కర్రలు, ఇటుక రాళ్లతో దాడికి దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని స్పష్టం చేశారు. అరాచక శక్తులపై ప్రజాప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.

జగన్ సవాల్‌కు సిద్ధమా - లేదంటే యువతకు క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేశ్