ETV Bharat / state

మహిళలను అవమానపరిచిన జగన్‌ క్షమాపణ కోరాలి: మంత్రి లోకేశ్ - NARA LOKESH FIRES ON SAKSHI MEDIA

మహిళలను కించపరిచిన జగన్‌ ముఠాను ఎట్టిపరిస్థితుల్లో క్షమించమన్న నారా లోకేశ్ - మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం నయం చేస్తామని ధ్వజం

Nara Lokesh
Nara Lokesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 7, 2025 at 6:14 PM IST

4 Min Read

NARA LOKESH FIRES ON SAKSHI MEDIA: అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్​ స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తామని హెచ్చరించారు.

దేవతల రాజధాని అమరావతి దెయ్యం జగన్‌ పని పడుతుందని ఎద్దేవా చేశారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరించారని గుర్తు చేశారు. మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. జగన్ మీడియా సాక్షిలో అంత ఘోరంగా మహిళల్ని అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం దిగజారుడుతనానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది తమ మీదే పడుతుందని ఆక్షేపించారు.

అమరావతిపై విషం చిమ్మితే: అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తమ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానేనని లోకేశ్​ స్పష్టం చేశారు. భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి అని గుర్తు చేశారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి రాజధాని అని వెల్లడించారు. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి అని తేల్చిచెప్పారు.

కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నామని లోకేశ్​ గుర్తు చేశారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతామని, ఆడపిల్లలా ఏడొద్దు, తామేమీ గాజులు తొడుక్కోలేదు వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని తెలిపారు.

జగన్, అతని పేటీఎం బ్యాచ్‌ది పైశాచిక ఆనందం: రాజధాని అమరావతిపై జగన్, అతని పేటీఎం బ్యాచ్ ది పైశాచిక ఆనందమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. రాజధాని మహిళల్ని కించపరిచే మీరు అసలు తినేది అన్నమేనా లేక ఇంకేదైనానా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పనికిమాలిన బ్యాచ్​తో ఇంకెంత కాలం అమరావతిపై విషప్రచారం సాగిస్తారు అని ప్రశ్నించారు. తలా తోక లేకుండా అర్ధం లేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరిచే మీరు అసలు మనుషులేనా అని నిలదీశారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదా అని ఆక్షేపించారు. గత 5 ఏళ్లు ఎక్కడుండి పరిపాలన చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఇళ్లు ఎక్కడుంది, ఎక్కడున్నారని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి నిజంగా దేవతల రాజధాని: రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడటం నీచాతి నీచమని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. అమరావతి రాజధానిపై జగన్, అతని పేటీఎం బ్యాచ్ ఇంకా విషం కక్కడం దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్ భారతి నిర్వహించే ఛానల్​లో మహిళలను కించపరచడం వారి చిల్లర బుద్ధికి నిదర్శనమని దుయ్యబట్టారు. అమరావతి నిజంగా దేవతల రాజధాని అని అనగాని స్పష్టంచేశారు. అమరావతి మహిళల ఉసురు కారణంగానే 11 సీట్లకు పడిపోయారన్నారు. అమరావతి మహిళలను ఇంకా అవమానిస్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి అని, మన రాజధాని మన అమరావతి శాశ్వతమని తేల్చిచెప్పారు.

పెయిడ్ ఆర్టిస్టులతో అవమానించడం దుర్మార్గం: రాష్ట్ర ప్రజలు సాక్షి మీడియా పట్ల తీవ్రంగా ఆలోచించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే, తగిన మూల్యం చెల్లించుకోక తప్పద్దని హెచ్చరించారు. ఇప్పటికీ ఆ మీడియా ఆలోచనలో మార్పు రానందున ప్రజలు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. బుద్ధి లేని చెత్త సాక్షి మీడియా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా రాజధాని అమరావతి మహిళల్ని అవమానించడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. గత ఎన్నికల్లో మహిళలు చావు దెబ్బ కొట్టినా ఇంకా బుద్ది రాలేదా అని యరపతినేని ప్రశ్నించారు. సాక్షి ఛానల్​ను నడిపేది ఓ మహిళ అనే విషయం మరిచారా అని నిలదీశారు. అవినీతి సొమ్ముతో పుట్టిన సాక్షి మీడియా ఎన్నికలు ముందు కూడా అమరావతి మహిళలపై విష ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకి వారింట్లో మహిళలు కూడా అన్నం నీరు ఇవ్వకుండా చెప్పులతో కొట్టాలని పిలుపునిచ్చారు.

అలా ఎలా జగన్? - తెనాలి పర్యటనలో లాజిక్కులు మిస్సయ్యారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.