Krishna Police Drone Video : ఏపీలో డ్రోన్లు ఎక్కడ కనిపించిన మందుబాబులు పరుగులు తీస్తున్నారు. వాటి కంటపడకుండా వాగులు, వంకలు, ఏటి గట్లు, రైల్వే ట్రాక్‌లపై మత్తుదిగేదాక పరుగెత్తుతున్నారు. ఇంతకి డ్రోన్లంటే మందుబాబులకు ఎందుకు అంత భయం అనుకుంటున్నారా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేరాల నియంత్రణతో పాటు గంజాయి, మాదక ద్రవ్యాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటిని నివారించేందుకు వీటిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు సైతం డ్రోన్ల పర్యవేక్షణతో శివారు ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. గంజాయి, మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు దిగే ఆకతాయిల ఆట కట్టించడమే లక్ష్యంగా వీటిని వినియోగిస్తున్నారు. తాజాగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ ద్వారా గుర్తించి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను మంత్రి నారా లోకేశ్ రీపోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ జత చేశారు.
Feel sorry for the guys relaxing in the fields. 😬 Can't help, because the @appolice100 drones do their job. https://t.co/Ndzmhqfvy1
— Lokesh Nara (@naralokesh) April 7, 2025
AP Police Drones : ఇటీవల గుడివాడ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల వెనక మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు గుర్తించారు. బహిరంగ ప్రదేశంలో లిక్కర్ సేవిస్తున్నారంటూ వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. యువకులు మద్యం తాగుతున్న దృశ్యాలను కృష్ణా పోలీసులు డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఆ వీడియోకి మన్మథుడు సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జోడించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దానిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ రీపోస్ట్ చేశారు. 'సారీ గాయ్స్ నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారి విధులు నిర్వర్తిస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.
కళ్లముందే వేలాది మద్యం సీసాలు - ఆగలేకపోయిన మందుబాబులు - DRUNKARDS LOOTED LIQUOR
ఆ ఇళ్లలో అసాంఘిక కలాపాలు- మద్యం, గాంజా మత్తులో బెదిరింపులు - VIJAYAWADA JNNURM HOUSES