Lokesh Felicitate Inter Students : ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు తెచ్చుకొని ప్రభుత్వ విద్య పరువును కాపాడారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ కళాశాల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేవేసిన విద్యార్థులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి, మార్కుల్లో టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను ఉండవల్లి తన నివాసంలో ఘనంగా సన్మానించిన మంత్రి వారికి బంగారు పతకం, ల్యాప్‌టాప్ లను అందజేశారు.
బ్రాండ్ అంబాసిడర్స్: షైనింగ్ స్టార్స్ 2025 పేరుతో మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, హైస్కూల్‌ప్లస్, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో గ్రూపుల వారీగా టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులతో భేటి అయ్యారు. మొత్తం 52మందిలో 43 మంది టాపర్లు బాలికలే కావడం విశేషం. విజేతలకు హ్యాట్సాప్ అన్న లోకేశ్, వారిని బ్రాండ్ అంబాసిడర్స్‌గా అభివర్ణించారు. అందరితో భేటీ కావటం తన అదృష్టమన్న మంత్రి విద్యార్థుల మధ్య పోటీ ఉండాలని సూచించారు. జీవితంలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన వీరిని చూసి చాలా మంది స్పూర్థి పొందాలని ఆకాంక్షించారు.
పని ఒత్తిడిలో: వ్యాపారంలో బ్రాహ్మణి తన కంటే మెరుగని విద్యార్థులతో లోకేశ్ పలు విషయాలు పంచుకున్నారు. పని ఒత్తిడిలో తను కూడా అమ్మ, అబ్బాయి దేవాన్ష్‌తో మాట్లాడాలనే విషయం మిస్ అవుతానని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివిస్తే ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు విదేశీ విద్యకు ప్రత్యామ్నాయం తీసుకువస్తామని తెలిపారు.
గుర్తుకొస్తున్నాయి :ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వసతులు మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్‌లో ఏకరూప దుస్తులు అందిస్తే బాగుంటుందని చాలా మంది విద్యార్థులు కోరినందున, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశాలను అమలు చేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. చదువుకునే రోజుల్లో తాను వెనుక బెంచి విద్యార్థిని అంటు తన అనుభావాలను పంచుకున్నారు.
ఇంకా చేయాలి: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని లోకేశ్ గుర్తు చేశారు. పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్ అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించామని తెలిపారు. ప్రిన్సిపాళ్లకు పదోన్నతులు ఇవటం లాంటివి అనేకం చేసిన, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. విద్యాశాఖలో జూన్ నాటికి సంస్కరణలు పూర్తి చేసి, అనంతరం అభ్యసన సామర్థ్యాలపై దృష్టి పెడతామని తెలిపారు.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో విచిత్రం - అన్ని సబ్జెక్టుల్లో 99% - ఇంగ్లీష్‌లో 5 మార్కులే
క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్లో 420 మార్కులు - డాక్టర్ అవుతానంటున్న సృజనామృత