Minister Kollu Ravindra on Masula Beach Festival-2025 : రాష్ట్రంలో పర్యాటకాన్ని విస్తరించడం లక్ష్యంగా మంగినపూడి బీచ్ వద్ద మసులా బీచ్ ఫెస్ట్ -2025 నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకూ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్‌గా బీచ్ ఫెస్ట్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారుస్తామని వెల్లడించారు. బందరును గేట్ వే ఆఫ్ అమరావతిగా మారుద్దామన్నారు.
క్రీడలు, వినోదంతో కన్నుల పండువగా ఉత్సవం నిర్వహించనున్నామని, ఇందులో రాష్ట్ర ప్రజలంతా పాల్గొని విజయవతం చేయాలని మంత్రి కోరారు. బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్యూజ్మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, అడ్వెంచర్స్, బీచ్ కబడ్డీ నిర్వహిస్తున్నామని ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీలో తొలిసారిగా సీ కయాకింగ్ (సముద్రంలో కయాక్ ద్వారా ప్రయాణించడం, ఇది ఒక రకమైన జల క్రీడ. కయాక్ అనేది ఒక చిన్న, తెరవని పడవ, ఇది సింగిల్-బ్లేడ్ తెడ్డుతో నడపబడుతుంది) నిర్వహిస్తున్నామన్నారు. దాదపు 2 వేల మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారని వెల్లడించారు. హెలీ రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశామని వివరించారు.
పర్యాటక విస్తరణే లక్ష్యంగా మంగినపూడి బీచ్ వద్ద మసులా బీచ్ ఫెస్ట్ -2025ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. చాలా సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కొంతమంది కేంద్రమంత్రులు సైతం హాజరవుతారు. బీచ్ ఫెస్ట్ కోసం మంగళవారం 2కే రన్ నిర్వహిస్తున్నాం. దీనికి భైరవం సినిమా యూనిట్ వస్తుంది. ఈనెల 5, 6, 7, 8 తేదీల్లో నిర్వహించే మసులా బీచ్ ఫెస్ట్‌ను ప్రజలంతా విజయవంతం చేయాలి. - మంత్రి కొల్లు రవీంద్ర
శ్రీకాకుళంలో అడ్వెంచర్ పార్కులు - గోవాకు దీటుగా బారువ బీచ్
పేరుపాలెం బీచ్ చూడాల్సిందే - కుటుంబంతో గడిపేందుకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్