ETV Bharat / state

గ్యాస్​ సమస్యలకు చెక్​ - అంగన్​వాడీలకు ఇండక్షన్ స్టౌవ్స్: మంత్రి గుమ్మడి సంధ్యారాణి - INDUCTION STOVES ANGANWADI

అంగన్​వాడీలను అభివృద్ధి చేయడమే లక్ష్యం - అంగన్​వాడీ కేంద్రాలపై సోలార్ అమర్చేందుకు కేంద్రానికి లేఖ రాశామన్న నేతలు

Minister distribute induction Stove
Minister distribute induction Stove (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 5, 2025 at 6:03 PM IST

2 Min Read

Induction Stoves Distributed to Anganwadi Centres : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55 వేల అంగన్​వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌవ్స్ అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో వాటిని అంగన్​వాడీ కేంద్రాల్లో పని చేసే సిబ్బందికి అందజేశారు.

అంగన్​వాడీ కేంద్రాల్లో గ్యాస్ సమస్య ఉందని, ఈ ఇండక్షన్ స్టౌవ్స్​తో సమస్యను అధిగమించవచ్చని మంత్రి అన్నారు. అంగన్​వాడీలకు గ్రాట్యుటీ ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం అని తెలిపారు. వారికి మెుదట రూ.2500 జీతం ఉండేదని ఆ తర్వాత 7 వేల చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబేనని అన్నారు.

అంగన్​వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌవ్స్ పంపిణి (ETV Bharat)

"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్రంలో ఉన్న 55వేల అంగన్​వాడి కేంద్రాలకు ఇండక్షన్​ స్టవ్స్​ ఇవ్వాలని నిశ్చయిచాం. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విభాగంలో అంగన్​వాడి వర్కర్స్​కోసం ఈ స్టవ్స్​ అందజేశాం. వర్కర్స్​కి గ్యాస్​తో ఇబ్బంది తలెత్తుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని ఇస్తున్నాం. ఒక్కో సెంటర్​కి లక్ష రూపాయలు ఇస్తున్నాం. తాగు నీటి సమస్యలు, మూత్రశాలల సమస్యలు, నిర్మాణాలు పెండింగ్​లో ఉన్నాయో వాటి కోసం త్వరలో నిధుల మంజూరు చేస్తాం. మినీ అంగన్​వాడి సెంటర్​లను అంగన్​వాడీలుగా మార్చడం కోసం ముఖ్యమంత్రితో ఒప్పందం జరిగింది. అంగన్​వాడీ మహిళలందరికి ఒక గుర్తింపు ఉండాలని గ్రాట్యుటీ ఇస్తున్నాం. కావున మహిళలు దాన్ని వినియోగించుకోవాలి. అంగన్​వాడిలో తల్లీ, బిడ్డకి పౌష్ఠికరమైన భోజనం పెట్టడంలో కూటమి ప్రభుత్వం చక్కగా పని చేస్తోంది. అంగన్​వాడీ జీతాలు 2500పెంచింది చంద్రబాబు ప్రభుత్వమే, 7000 చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే." -గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ అంగన్​వాడీ కేంద్రాలపై సోలార్ అమర్చేందుకు కేంద్రానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అతి తర్వలోనే ఈ కార్యక్రమం సైతం చేపడుతామన్నారు.

"అంగన్​వాడీ కేంద్రాలకు సోలార్​ సిస్టమ్స్​ ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరాం. లేఖ కూడా రాశాం పరిశీలన జరుగుతోంది. కొత్త అంగన్​వాడీ కేంద్రాల్లో ప్రహారీ నిర్మాణం, కిచెన్, సోలార్​ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది." -కేశినేని చిన్ని, విజయవాడ ఎంపి

సొంత నిధులు వెచ్చించి అయినా అంగన్​వాడీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.

"చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో భవనం ఏర్పాటు చేయాలని కొన్ని నమూనాలు చూశాం. అంగన్​వాడీ కేంద్రాన్ని ప్రత్యేకమైన నిర్మాణంతో ఏర్పాటు చేస్తే, తక్కువ ఖర్చుతో ఎక్కువ సదుపాయాలు వస్తాయి. అవసరమైతే వ్యక్తిగతంగానైనా సదుపాయాలు కల్పించడం కోసం కృషి చేస్తాం. పూర్తిగా అభివృద్ధి పరచి పిల్లలకు మంచి భవిష్యత్తు అందజేస్తాం." -గద్దె రామ్మోహన్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే

చుక్కలు చూపిస్తోన్న యాప్ - అంగన్‌వాడీల్లో తప్పని తిప్పలు

రంపచోడవరంలో అంగన్వాడీ పిల్లలకు ఎమ్మెల్యే పాఠాలు - MLA Shirisha Visit Anganwadi Center

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.