Minister Dola About Grama Ward Secretariat Rationalization : గ్రామ, వార్డు సచివాలయాల కోసం జిల్లాల్లో మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియపై ఉద్యోగ సంఘాల ఆందోళన అనసవరమని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోవటం లేదని మంత్రి తేల్చి చెప్పారు. పని విభజనను శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
కేటగిరి ఏ లో పంచాయితీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారని వివరించారు. మహిళా పోలీస్లను మరో కేటగిరీలో చేర్చాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని పోస్టులు కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఒక్కో సచివాలయానికి 7 నుంచి 8 పోస్టులు ఉండేలా రేషనలైజేషన్ ప్రక్రియ చేస్తున్నట్టు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవని మంత్రి తెలియచేశారు. జిల్లా స్థాయిలో ఒకరు, మండలస్థాయిలో మరో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారని వెల్లడించారు. పనిభారం తగ్గించే విధంగానే రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఉద్యోగుల సీనియారిటితో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్ ఉంటుందని వివరించారు.
వాలంటీర్లను వైఎస్సార్సీపీ మోసం చేసింది: మంత్రి డోలా బాల వీరాంజనేయ
పథకాల అమలుకు కావాల్సిన నిధుల గురించి ప్రస్తావించాం: మంత్రి డోలా