Minister Atchannaidu With cocoa Farmers in Eluru : రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోకూడదనే ఉద్దేశంతో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏలూరు నగరంలో పర్యటించిన ఆయన కలెక్టరేట్లో ఉద్యాన పంటలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం గోదావరి సమావేశ మందిరంలో కోకో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మరో మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు కుమ్మక్కై అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించకుండా రైతులను వేధిస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కంపెనీలతో మాట్లాడిన మంత్రి అచ్చెన్న ఈ ఏడాది రైతుల వద్ద ఇప్పటి వరకూ ఉన్న మొత్తం కోకో గింజలు కొనుగోలు చేసేలా వారిని ఒప్పించారు. ఇకపై కోకో రైతులు ఇబ్బందులు పడకుండా వచ్చే ఏడాది నుంచి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర వచ్చేలా చూస్తామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పేరుతో రైతులను మోసం చేసిందని ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
అకాల వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందన - పంట నష్టం అంచనా వేయాలని ఆదేశం
సముద్ర నాచుతో 45 రోజుల్లోనే ఆదాయం - విశాఖలో ఆర్టిఫిషియల్ రిఫ్ ప్రారంభం