Minister Atchannaidu Started Artificial Reef in Visakha: కేంద్ర సహకారంతో 150 కోట్లుతో విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ జాలరి ఎండాడలో రాష్ట్ర మత్స్య శాఖా మంత్రి సీ వీడ్ సెంటర్లను ప్రారంభించారు. అనంతరం కేరళ ప్రభుత్వ మత్స్య సంస్థతో సముద్ర నాచు అభివృద్ధి చేసే పక్రియలో ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశాలలో సీ వీడ్‌కు చాలా డిమాండ్ ఉందని విశాఖలో 3 సీ వీడ్ సెంటర్లను ప్రారంభించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 22 సీ విడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సముద్ర నాచు వల్ల 45 రోజుల్లోనే ఆదాయం వస్తుందని తెలిపారు. ఇదే సమయంలో కేజ్ కల్చర్ ద్వారా మంచి మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు.
గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో మొత్తం లూటీ చేసిందని అలానే ఆ ఐదేళ్లలో కేంద్ర నిధులనూ సరిగా వినియోగించలేదని విమర్శించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి మత్స్యకార్లు అభివృద్ధి అవ్వాలని సూచించారు. ట్రాన్స్ పౌండర్స్ ఉండటం వల్ల మత్స్యకారులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. నూతన పద్ధతులు వల్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా మత్స్య సంపద దొరుకుతుందని తెలిపారు. మత్స్యశాఖ అభివృద్ధికి కేంద్ర నిధులు ఇస్తోందని అలానే సీ వీడ్‌ను ఆధారం చేసుకొని చిన్న పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని మంత్రి అచ్చెన్న తెలిపారు.
చెరువుల్లో నాచును పండిస్తున్న గోదావరి వాసులు - ఉపాధితో పాటు చక్కని ఆదాయం
సముద్రపు నాచు అని తీసిపారేయకండి - వీటిని సాగు చేస్తే లాభాలు బాగు!