Minister Atchannaidu Comments on Aqua Sector: కేవలం విదేశీ ఎగుమతులపైనే ఆధారపడకుండా స్వదేశీ వినియోగం పెంచేలా రంగంలో రొయ్యి ఉత్పత్తుదారులతో ఓ కమిటీ వేసేందుకు యోచిస్తున్నట్లు వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమెరికా సుంకాల కారణంగా తీవ్ర భయాందోళనలు చెందుతున్న ఆక్వా రైతులు, ఎగుమతిదారులు ప్రస్తుత పరిణామాలకు ఎక్కువ దిగాలు చెందొద్దని కోరారు.
ట్రంప్ సుంకాలపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితులను నిశితంగా సమీక్షిస్తోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు ఎక్కువ మంది ఆధారపడిన ఈ రంగానికి అండగా నిలవాలని కూడా కోరుతున్నామని అన్నారు. విజయవాడలో రొయ్యి ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, వేగేశ్న నరేంద్రవర్మరాజు, ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ తదితులు పాల్గొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో మత్స్య రంగం కీలకభూమిక పోషిస్తోందని మన దేశం నుంచి అమెరికా వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై 26 శాతం దిగుమతి సుంకం అక్కడి ప్రభుత్వం విధించడం కలవరపాటుకు గురి చేస్తోందని మంత్రి అన్నారు.
అడవి తల్లిని నమ్ముకుంటే బువ్వ పెడుతుంది, నీడనిస్తుంది: పవన్‌కల్యాణ్
రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు వీలుగా ఇప్పటికే విద్యుత్తు సబ్సిడీ ప్రకటించిందని మంత్రి అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందాలన్నా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధన విధించిందని తెలిపారు. దాణా ధర తగ్గించే విషయంలోనూ తయారీదారులతో చర్చిస్తున్నామన్నారు. అమెరికా సుంకాల ఉపద్రవాన్ని అవకాశంగా మలచుకుని ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా ముందుకు వెళ్తామని రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే ఆర్మీ మెనులో రొయ్యిని చేర్చే విషయమై కేంద్ర మంత్రిని కలిసి చర్చిస్తామన్నారు. రొయ్యి సాగుదారులు తీవ్ర మనోవేదనతో ఉన్నారని వైరస్ వంటి ఇబ్బందులు మరింత పెరగకుండా రొయ్య కొనుగోలు జరిగేలా చూడాలని రైతులు కోరారు. సుంకాల ప్రకటన తర్వాత అమెరికాకు రాష్ట్రం నుంచి ఎగుమతులు ఆగాయని వ్యాపారులు తెలిపారు. ఈక్విడార్ ప్రధాన పోటీదారుగా ఉందని ఆ దేశానికి 10 శాతం వరకు సుంకాలు విధించి మన దేశం నుంచి వెళ్లే వాటిపై 26 శాతం ఉండడం ఇబ్బందికరంగా ఉందన్నారు.
ఎవరికీ ఏ కష్టం వచ్చినా నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: మంత్రి లోకేశ్
అడవి తల్లిని నమ్ముకుంటే బువ్వ పెడుతుంది, నీడనిస్తుంది: పవన్‌కల్యాణ్