Hygiene Precautions Are not Following in Telangana Govt Hospitals : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వడ్డించే భోజనం విషయంతో శుభ్రత కరువవుతోంది. ముఖ్యంగా వంట గదుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మురుగు పారుతున్న ప్రాంతంలోనే వంటలు చేస్తుండటం సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. అలానే రోగులకు ఆహారం పంపిణీ చేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ తనిఖీల్లో రోగులకు ఆహార పంపిణీలో పలు లోపాలు అధికారులు గుర్తించారు. తాజాగా ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఆహారం కలుషితమై ఒక రోగి మృ/తి చెందగా, మరో 35 మంది అస్వస్థతకు గురి కావడంతో మరోసారి చర్చనీయాంశమైంది.
మరింత అస్వస్థతకు : కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్లో వంటగది ముందు డ్రైనేజీ ఉండటంతో పంది కొక్కులు, ఎలుకలు సంచరిస్తున్నాయి. నాంపల్లి, గోల్కొండ, మలక్‌పేట ఏరియా ఆసుపత్రుల్లో వంట గదుల్లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు విజిలెన్సు అధికారులు గుర్తించారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి వంట గది పక్కనే మురుగు నీరు పారుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో కిచెన్ పరిసరాల్లో ఎలుకలు, బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నాయి. చేతులు పెట్టి రోగులకు భోజనం వడ్డిస్తున్నారు. దీంతో ఆహారం కలుషితమై మరింత అస్వస్థతకు గురవుతున్నారు.

ఆసుపత్రిలో చేరిన వారికి ఆహారం అందించేందుకు ఒక్కో రోగికి ప్రభుత్వం రూ.80వంతున కేటాయిస్తోంది. అయితే పలు ఆసుపత్రుల్లో మెనూ పాటించడం లేదని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ప్రభుత్వం వద్ద డైట్ బకాయిలు పేరుకుపోయాయని చెబుతూ కొందరు గుత్తేదారులు తోచిన మెను చేస్తున్నారు. సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలో నిత్యం ఒకే తరహా మెనుతో వడ్డించడం వల్ల రోగులు సక్రమంగా తినడం లేదు. రాత్రి సమయంలో చాలామంది రోగులు ఉండటం లేదు. వారి పేరుతో మాత్రం భోజనం వడ్డిస్తున్నట్లు రాస్తున్నారు. గతంలో ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో ఈ తరహా ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు.
వంట చేసే సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు :
- వంట చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- వంట చేసే ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
- వంట గదిలో బొద్దింకలు, ఎలుకలు లాంటివి లేకుండా ఎప్పటికప్పుడు పెస్ట్ కంట్రోల్ చేయాలి
- వంట చేసే ప్రాంతంలో మురుగు కాల్వలు, పైపులైన్ల లీకేజీలు ఉండకూడదు
- వేడిగా ఉన్నప్పుడే రోగులకు ఆహారం అందించాలి. రోగుల ప్లేట్లు వేడి నీటితో కడుక్కునేలా ఏర్పాట్లు చేయాలి.
- వడ్డించే సిబ్బంది చేతికి గ్లౌజులు ఉండాలి. తలకు టోపీ, నోటికి, ముక్కుకు మాస్క్ ఉండాలి.
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కల్లోలం - ఒకరు మృతి, 70 మందికి అస్వస్థత
'గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కుట్రల వెనక - బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ హస్తం'