ETV Bharat / state

పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారా? - ఇలాంటి కేటుగాళ్లుంటారు భద్రం

తెలంగాణలో పెరుగుతున్న మ్యాట్రిమోనీ మోసాలు - నకిలీ వివరాలతో మాయ చేస్తున్న మోసగాళ్లు - గోపత్య చాలా కీలకమంటున్న పోలీసులు

Matrimony App Scams for Money Increasing
Matrimony App Scams for Money Increasing (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 28, 2025 at 5:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Matrimony App Scams for Money Increasing : హైదరాబాద్​కు చెందిన మధ్యవయస్కుడు భార్య దూరమవడంతో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. డైవోర్స్​ మ్యాట్రిమోనీ యాప్​లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అక్కడ పరిచయమైన ఓ మహిళ తాను వైద్యరాలినని, భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నానంటూ యువకుడితో మాటలు కలిపింది. అతనితో సాన్నిహిత్యం పెరిగాక పెళ్లి ప్రతిపాదన తెచ్చింది.

అనుమానంతో : అలా కొన్ని రోజులయ్యాక తనకు అత్యవసరంగా రూ.5 లక్షలు కావాలని తీసుకుంది. తిరిగి ఇవ్వకపోవడం, పెళ్లంటే వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన యువకుడు సైబర్​క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వివాహ పరిచయ వేదికలే అడ్డాగా నకిలీ ఫొటోలు, సమాచారంతో ఎంతోమందిని మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు. కొత్త ఏడాది 20 రోజుల వ్యవధిలోనే మూడు పోలీస్​ కమిషనరేట్ల పరిధిలో 10కిపైగా ఈ తరహా ఫిర్యాదులు అందాయి.

సాకులు చెప్పి డబ్బులు కాజేస్తారు : ఉన్నత చదువులు కెరీర్​లో స్థిరపడాలని యువత పెళ్లి వాయిదా వేస్తున్నారు. ఇలా అన్నీ సమకూరాయనే సరికి మూడు పదుల వయసు దాటుతోంది. జోడి దొరకడం కష్టమవుతోంది. ఇదే ఆసరాగా చేసుకుంటున్న మాయగాళ్లు డేటింగ్, మ్యాట్రిమోనీ యాప్​లో, వెబ్​సైట్లలో వేర్వేరు పేర్లు, అందమైన ఫొటోలను జతచేసి రిజిస్ట్రేషన్ చేసుకుని యువతను నమ్మిస్తున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ప్రమాదాల బారిన పడ్డామని సాకులు చెప్పి అవతలి వ్యక్తి నుంచి వీలైనంత సొమ్ము కాజేస్తారు.

పెళ్లికాని ప్రసాద్​లు, అలాంటి పురుషోత్తములకు అలర్ట్! - ఆ భామల చూపులకు కాస్త దూరంగా ఉండండి

ఒక్కసారి డబ్బులొచ్చాక ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తారు. ఇటీవల నగరంలో పట్టుబడిన ఓ నిందితుడు ఇలా 40 మంది యువతులను మోసగించినట్టు దర్యాప్తులో తేలింది. శివారు ప్రాంతానికి చెందిన దంపతులు ఇదే తరహాలో డైవోర్స్​ మ్యాట్రిమోనీ యాప్​, వెబ్​సైట్​లో పేర్లు నమోదు చేసుకుని రూ.1.50 కోట్లు కొట్టేశారు.

చాలీచాలని ఉద్యోగంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న యువతీ యువకులు అదనపు రాబడి కోసం మోసాలకు పాల్పడుతున్నారు. తమకు విల్లాలు, విదేశాల్లో ఉద్యోగం ఉన్నాయని పరిచయమైన వారి వాట్సాప్​కు ఫొటోలు పంపించి టోకరా వేస్తున్నారు. తాజా కేసుల్లో నిందితులు ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఉంటున్నారు. మణికొండలోని గేటెడ్ కమ్యూనిటీ చిరునామాతో ఒక యువకుడు 60 మందిని బురిడీ కొట్టించాడు.

గోప్యత పాటిస్తేనే మంచిది : సామాజిక మాధ్యమాలు, వాట్సాప్​ ఫోన్​కాల్స్​, మెసేజ్​ల ద్వారా మోసగాళ్లు పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తారు. వెబ్​సైట్లు, యాప్స్​లో నకిలీ ప్రొఫైల్స్​తో రిజిస్టర్​ చేసుకుని వధూ, వరుల కోసం వెతికే ఎంతోమందిని మోసగిస్తున్నారు. అవతలి వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలియకుండా, పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రావొద్దని... పరిచయమైన కొద్దిసమయంలోనే పెళ్లి చేసుకుంటామంటూ చెప్పే వారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమాచారాన్ని నిర్ధారించుకోకుండా సానుకూల నిర్ణయం తీసుకుని ఆర్థికంగా, మానసికంగా నష్టపోవద్దు.

పెళ్లికాని ప్రసాద్​లు, పురుషోత్తములకు అలర్ట్ - అలాంటి మ్యాట్రిమోనీని సంప్రదిస్తే అంతే!

మ్యాట్రిమోనిలో అతివలకు వల - షాదీ.కామ్​లో నకిలీ డాక్టర్​ నయా మోసం