Massive Theft At Sunsteel Store in Begumpet : సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డలో ఉన్న సన్ స్టీల్ దుకాణంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ చోటు చేసుకుంది. స్టీల్ దుకాణంలోని లాకర్ నుంచి రూ.48 లక్షలు అపహరణకు గురైనట్లు దుకాణ యజమాని గిరీష్ జైన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలో పని చేసే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డట్లు సీసీ కెమెరాల్లో నమోదైందని దుకాణ యజమాని పోలీసులకు తెలిపారు.
ఘటనా స్థలికి డీసీపీ : శుక్రవారం రాత్రి సమయంలో అందరూ తమ తమ విధులు ముగించుకుని వెళ్లే క్రమంలో ఆలస్యంగా దుకాణం నుంచి బయలుదేరిన రాజస్థాన్ వ్యక్తి, లాకర్లో ఉన్న సొమ్మును దొంగిలించి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాల్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
దొంగలున్నారు నగలు జాగ్రత్త! - వస్తారు కాగితం పొట్లం చుడతారు - బంగారం బదులు గులకరాళ్లు
చాదర్‌ఘాట్‌లో భారీ దొంగతనం - 75 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు