Marriage Season Arrangements Stars in Telugu States : కల్యాణోత్సవాలకు వేళైంది. ఒక పక్క మండుటెండలు, మరో పక్క శుభ ముహూర్తాలు. తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం వచ్చిందంటే పల్లె, పట్టణం తేడా లేకుండా పెళ్లి బాజాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 8 వరకు మంచి రోజులు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
ముహూర్తాలు సమీపిస్తుండటంతో పెళ్లి సందడి మొదలైంది. రాబోయే మూడు నెలల పాటు వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పనులు దొరకనున్నాయి. ఇప్పటికే పలువురు అడ్వాన్స్‌లు చెల్లించి శుభకార్యాలకు అవసరమైన వేదికలను రిజర్వ్ చేసుకున్నారు.
ఊపందుకున్న కొనుగోళ్లు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఫంక్షన్ హాళ్లలో వసతులను బట్టి ఒక్కో రోజు అద్దె రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండటంతో వాటి ధరలు అమాంతం పెంచేశారు. మరో పక్క వస్త్ర, బంగారు, దుకాణాలు సందడిగా మారాయి. ఉభయ జిల్లాల్లోని దుకాణాలతో పాటు కొంత మంది ప్రజలు నగరాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
మూడు మాసాల్లో 24 ముహూర్తాలు
ముహూర్తాలు ఇలా
- ఏప్రిల్ మాసంలో: 16, 18, 20, 21, 23, 30
- మే: 1, 7, 8, 9, 10, 11, 14, 17, 18, 21, 22, 23, 28
- జూన్: 4, 5, 6, 7, 8 ఏప్రిల్ 30న బుధవారంతో కూడిన అక్షయ తృతీయ రావడంతో కొన్ని వేల సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు కుదుర్చుకున్నారు. ఆ రోజు పెళ్లి మండపాలు కూడా దొరకని పరిస్థితి ఉన్నట్లు సమాచారం.
పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ - పంచాంగకర్తలు చెప్పిన శుభముహూర్తాలు ఇవే!
ముహూర్తాలు సమీపించడంతో పెళ్లి పెద్దలు ఒకవైపు కుటుంబ సభ్యులు మరోవైపు ఏర్పాట్లపై వ్యూహ రచనకు రంగంలోకి దిగారు. కొనుగోలు, విందు, ఫొటో షూట్, రాకపోకల కోసం ఇరు కుటుంబాల చర్చలు సాగుతున్నాయి. కల్యాణ మండపాలు హంగామాలతో రూపు దిద్దుకుంటున్నాయి. శుభ ముహూర్తాలకు తెరతొలగి, పెళ్లిళ్ల బాజాల, భజంత్రీలతో సహా బరాత్‌ల మోత మోగనుంది. మాఘ, ఫాల్గుణ మాసాలలో శుభ ముహూర్తాలున్నట్లుగా పంచాంగకర్తలు, పూజారులు, బ్రాహ్మణులు చెబుతున్నారు. దీంతో వివాహాలను కుదుర్చుకునే పర్వాలలో పెళ్లి చూపులు, మాటా ముచ్చట్లు వేగవంతమయ్యాయి.
మోగనున్న పెళ్లి బాజాలు - పంచాంగకర్తలు చెప్పిన శుభముహూర్తాలు ఇవే!