Marriage Dates 2025 in Summer in Telangana : ఈ మండు వేసవి కాలంలో శుభకార్యాల ఘడియలు వచ్చేశాయి. ఇప్పటి వరకు మంచి ముహూర్తాల సమయం కోసం వేచి చూస్తున్న వారికి తీయ్యటి కబురు అందింది. ఈ నెల మే, జూన్ నెలల్లో మంచి ముహూర్తాలు అధికంగా ఉండటంతో తెలుగింట వేడుకలకు సన్నద్ధం అమవుతున్నారు. వరుసగా మంచి రోజులు ఉన్న నేపథ్యంలో కల్యాణ మండపాలు దొరకని పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు వేడుక నిర్వాహకులకు ఊపిరి పీల్చుకునే తీరిక లేకుండా ఆర్డర్లు తలుపు తడుతున్నాయి. పురోహితులకే కాకుండా సన్నాయిమేళం, బ్యుటీషియన్లు, వంట మేస్త్రీలు, వీడియోగ్రాఫర్లతో పాటు అనుబంధ రంగాల్లో వారికి 3 నెలల పాటు విశ్రాంతి ఉండదు.
వచ్చే మూడు నెలల్లో మంచి ముహూర్తాల తేదీలు ఇవే : -
- ఏప్రిల్ : 16, 20, 30
- మే : 1, 7, 8, 9, 10, 11, 14, 18, 23.
- జూన్ : 4, 5, 6, 7, 8
విశ్వావసు నామ సంవత్సరంలో అధికంగా వివాహాలు : వచ్చే నెల 10 నుంచి 28 వరకు కత్తెర ఉన్నప్పటికీ ఈ టైంలో పెళ్లిళ్లు జరిపించుకోవచ్చని పురోహితులు సూచనలు చేస్తున్నారు. అదే విధంగా జూన్ 11 నుంచి జులై 12 వరకు అంటే నెల రోజుల పాటు గురు మూఢమి కావటంతో ముహూర్తాలకు విరామం వచ్చింది. తిరిగి శ్రావణ మాసం నుంచి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. మొత్తంగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో అధికంగా వివాహాలు జరుగనున్నాయి.
వివాహాలకు అనుకూలం : కల్యాణ మండపాలను 6 నెలల క్రితమే సిద్ధం చేసుకున్నారు : 3 నెలల వ్యవధిలో మంచి ముహూర్తాలు అధికంగా ఉన్నాయని వేద పండితులు శ్రీనివాసుల అనంతాచార్యులు తెలిపారు. ఈ కాలంలో కల్యాణం జరుపుకోవడం శుభప్రదాయమని అన్నారు. ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు తీసుకున్నవారు వేడుకలు జరుపుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారని, కొన్ని చోట్ల కల్యాణ మండపాలను 6 నెలల క్రితమే సిద్ధం చేసుకున్నారని వివరించారు.
అమెరికా పెళ్లి సంబంధం - ట్రంప్ ఇంటర్వ్యూ పాసవుతారా మరి? - లేదంటే అంతే!
పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఎప్పుడు? - లేట్ అయితే వచ్చే ఇబ్బందులు ఏంటి?